గొట్టిపాటి బ్రహ్మయ్య
గొట్టిపాటి బ్రహ్మయ్య | |
---|---|
జననం | గొట్టిపాటి బ్రహ్మయ్య 1898డిశంబరు 3 కృష్ణా జిల్లాలోని చినకళ్ళేపల్లి |
మరణం | 1982 జులై 19 |
వృత్తి | 1922-23లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు 1923-29లో కృష్ణా జిల్లా ఖాదీ బోర్డుకి అధ్యక్షుడు 1962లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు 1964 - 1968 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమర యోధుడు |
గొట్టిపాటి బ్రహ్మయ్య (1889-1984) రైతు పెద్ద అను బిరుదుతో పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు. భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ (1982) అవార్డు గ్రహీత.
జననం
[మార్చు]గొట్టిపాటి బ్రహ్మయ్య గారు కృష్ణా జిల్లాలోని చినకళ్ళేపల్లి లో1889 డిసెంబరు 3 న జన్మించారు.
1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేసారు. 1923-29లో కృష్ణా జిల్లా ఖాదీ బోర్డుకి అధ్యక్షునిగా ఉన్నారు.
స్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన జమీందార్ రైతు ఉద్యమంలో ఆచార్య ఎన్.జి.రంగా గారితో కలసి పాల్గోన్నారు,
"సైమన్ కమిషను" బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మున్నగు పలు కార్యక్రమాలలో పాలుపంచుకుని, పెక్కు దినాలు జైలుపాలయ్యారు.
స్వాతంత్ర్యానంతరం ఆయన 1962లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1964 జూలై 25 నుండి 1968 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షునిగా పనిచేసారు.
పురస్కారాలు
[మార్చు]- ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ
- భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ (1982)
జీవితచరిత్ర
[మార్చు]గొట్టిపాటి బ్రహ్మయ్య గారి జీవితచరిత్రను గొర్రెపాటి వెంకట సుబ్బయ్య రచించగా దీని మూడవ ముద్రణను 1955లో షష్టిపూర్తి సంఘంవారు ప్రచురించారు.[1] నా జీవన నౌక అనేపేరుతో వెలువడిన ఆయన ఆత్మకథ ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది.
మరణం
[మార్చు]గొట్టిపాటి బ్రహ్మయ్య గారు 1982 జూలై 19 న పరమపదించారు.