సోహ్రాబ్ మోడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోహ్రాబ్ మెర్వాంజీ మోడీ
సోహ్రాబ్ మోడీ
1931 సోహ్రాబ్ మెర్వాంజీ మోడీ
జననం(1897-11-02)1897 నవంబరు 2
మరణం1984 జనవరి 28(1984-01-28) (వయసు 86)
జాతీయతభారతీయుడు
మినర్వా మోవిటోన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సినిమా దర్శకుడు, రచయిత, నటుడు
జీవిత భాగస్వామిమెహతాబ్ మోడీ
పురస్కారాలుదాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (1980)

సోహ్రాబ్ మెర్వాంజీ మోడీ ( 1897 నవంబరు 2 - 1984 జనవరి 28) నాటకరంగ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత.[1] షేక్స్పియర్ రాసిన హామ్లెట్ నాటకం ఆధారంగా తీసిన ఖూన్ కా ఖూన్ (1935), సికందర్, పుకర్, పృథ్వీ వల్లబ్, ఝాన్సీ కి రాణి, మీర్జా గాలిబ్, జైలర్, నౌషర్వాన్-ఇ-ఆదిల్ (1957) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు రూపొందించిన సినిమాలు సామాజిక, జాతీయ సమస్యలపై సందేశాన్ని కలిగి ఉంటాయి.[2] 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నాడు. ఈ ఆవార్డును అందుకన్న వారిలో పదవ వ్యక్తి. ఇతడు దర్శకత్వం వహించిన మీర్జా గాలిబ్ సినిమాకు రెండవ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు వచ్చింది.

జననం

[మార్చు]

సోహ్రాబ్ మోడీ 1987, నవంబరు 2న పార్సీ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఇడియన్ సివిల్ సర్వెంట్. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో తన బాల్యాన్ని గడిపిన మోడీ, అక్కడ హిందీ, ఉర్దూ నేర్చుకున్నాడు.[3]

2013 భారత స్టాంప్ పై సోహ్రాబ్ మోడీ
1941లో వచ్చిన సికిందర్ సినిమాలో సోహ్రాబ్ మోడీ

సినిమాలు

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
  • ఖూన్ కా ఖూన్ (1935)
  • సెడ్-ఎ-హవాస్ (1936)
  • ఆత్మ తరంగ్ (1937)
  • ఖాన్ బహదూర్ (1937)
  • జైలర్ (1938)[2]
  • మీతా జహార్ (1938)
  • పుకార్ (1939)
  • భరోసా (1940)
  • సికందర్ (1941)[3]
  • ఫిర్ మిలెంగే (1942)
  • పృథ్వీ వల్లబ్ (1943)
  • పరాఖ్ (1944)[4]
  • ఏక్ దిన్ కా సుల్తాన్ (1945)
  • మంజ్ధర్ (1947)
  • నరసింహ అవతార్ (1949)
  • దౌలత్ (1949)
  • షీష్ మహల్ (1950)
  • ఝాన్సీ కి రాణి (1953)
  • మీర్జా గాలిబ్ (1954)
  • కుందన్ (1955)
  • రాజ్ హాత్ (1956)
  • నౌషర్వాన్-ఇ-ఆదిల్ (1957)
  • జైలర్ (1958)
  • మేరా ఘర్ మేరే బాచే (1960)
  • సమయ్ బడా బల్వాన్ (1969)

నటుడిగా

[మార్చు]
సినిమా సంవత్సరం పాత్ర
ఖూన్ కా ఖూన్ 1935 హామ్లెట్
సెడ్-ఎ-హవాస్ 1936 కజల్ బేగ్ (హుబెర్ట్)
జైలర్ 1938 జైలర్
మీతా జహార్ 1938
పుకార్[4] 1939 సర్దార్ సంగ్రామ్ సింగ్
సికందర్[3] 1941 పోరస్ రాజు
పృథ్వీ వల్లభ్ 1943 ముంజా
శీష్ మహల్ 1950 ఠాకూర్ జస్పాల్ సింగ్
ఝాన్సీ కి రాణి 1952 రాజ్ గురు
కుందన్ 1955 కుందన్
రాజ్ హాత్ 1956 రాజా బాబు
నౌషర్వాన్-ఇ-ఆదిల్ అలియాస్ ఫార్జ్ ఔర్ మొహబ్బత్ 1957 సుల్తాన్-ఇ-ఇరాన్ నౌషర్వాన్-ఎ-ఆదిల్
యాహుడి[2] 1958 ఎజ్రా, యూదుడు
జైలర్ 1958 దిలీప్
పెహ్లి రాత్ 1959
వోహ్ కోయి ఔర్ హోగా 1967
నూర్ జహాన్ 1967 కాజీ
జ్వాలా 1971
ఏక్ నరి ఏక్ బ్రహ్మచారి 1971 రైసాహెబ్ సూరజ్‌భన్ చౌదరి
రజియా సుల్తాన్ 1983 వజీర్-ఎ-అజామ్

ఇతర వివరాలు

[మార్చు]
  • 1960లో 10వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యుడిగా ఉన్నాడు.[5]
  • 2005లో ఫాల్కే పతకం, మోడీ కఫ్ పరేడ్ ఇంటి నుండి కొన్ని సిరామిక్ ముక్కలు ముంబైలోని పురాతన వస్తువుల మార్కెట్ అయిన చోర్ బజార్‌కు విక్రయించబడ్డాయి.

మరణం

[మార్చు]

మోడీ ఎముక మజ్జ క్యాన్సర్ తో బాధపడడుతూ తన 86 సంవత్సరాల వయస్సులో 1984, జనవరి 28న మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Gulazāra; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 614–. ISBN 978-81-7991-066-5. Archived from the original on 11 October 2020. Retrieved 26 June 2021.
  2. 2.0 2.1 2.2 2.3 Karan Bali. "Sohrab Modi profile". Upperstall.com website. Archived from the original on 27 November 2019. Retrieved 26 June 2021.
  3. 3.0 3.1 3.2 Sohrab Modi (1897 - 1984) - profile on Cineplot.com website Archived 25 సెప్టెంబరు 2017 at the Wayback Machine Published 13 June 2010, Retrieved 26 June 2021
  4. 4.0 4.1 Yesteryear actress Mehtab remembers her husband Sohrab Modi Archived 23 డిసెంబరు 2014 at the Wayback Machine Cineplot.com website (14 September 2013), Retrieved 26 June 2021
  5. "10th Berlin International Film Festival: Juries". berlinale.de. Retrieved 26 June 2021.

బయటి లింకులు

[మార్చు]