బిబ్‌కోడ్
పూర్తి పేరు | బిబ్లియోగ్రాఫిక్ కోడ్ |
---|---|
ప్రవేశపెట్టిన తేదీ | 1990s |
అంకెల సంఖ్య | 19 |
చెక్ డిజిట్ | లేదు |
ఉదాహరణ | 1924MNRAS..84..308E |
బిబ్‌కోడ్ అనేది ఖగోళ శాస్త్ర సంబంధ సాహిత్యం లోని ఆకరాలను ప్రత్యేకంగా పేర్కొనడానికి అనేక ఖగోళ డేటా సిస్టమ్‌లు ఉపయోగించే ఒక పొందికైన ఐడెంటిఫైయర్. దీన్ని రెఫ్‌కోడ్ అని కూడా పిలుస్తారు.
స్వీకారం
[మార్చు]బిబ్లియోగ్రాఫిక్ రిఫరెన్స్ కోడ్ (రిఫ్‌కోడ్) ను SIMBAD లోను, NASA/IPAC ఎక్స్‌ట్రా-గలాక్టిక్ డేటాబేస్ (NED) లోనూ ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసారు. అయితే ఇది డి ఫాక్టో ప్రమాణంగా మారింది. ఇప్పుడు మరింత విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఉదాహరణకు, NASA ఆస్ట్రోఫిజిక్స్ డేటా సిస్టమ్ - ఈ "బిబ్‌కోడ్" అనే పదాన్ని కాయించినది వాళ్ళే - దీన్ని వాడూతుంది. [1]
ఫార్మాట్
[మార్చు]బిబ్‌కోడ్ 19 అక్షరాల కచ్చితమైన పొడవుతో, కింది ఆకృతిలో ఉంటుంది.
YYYYJJJJJVVVVMPPPPA
ఇక్కడ YYYY
అనేది నాలుగు-అంకెల సంవత్సరానికి సూచిక కాగా, JJJJJ
అనేది ఎక్కడ ప్రచురించబడిందో సూచించే కోడ్. VVVV
అనేది జర్నల్ రిఫరెన్స్ విషయంలోనైతే వాల్యూమ్ సంఖ్య, M
అనేది ప్రచురించబడిన పత్రిక లోని విభాగాన్ని సూచిస్తుంది. PPPP
ప్రారంభ పేజీ సంఖ్యను ఇస్తుంది. A
అనేది మొదటి రచయిత చివరి పేరు లోని మొదటి అక్షరం. ఉపయోగించని ఫీల్డ్‌లను పూరించడానికీ, ఏదైనా ఫీల్డులో ఇచ్చిన విలువ పొడవు తక్కువగా ఉంటే దాన్ని నిర్ణీత పొడవు వరకు ప్యాడింగు చేయడానికి పీరియడ్ (.
) లను ఉపయోగిస్తారు; ప్యాడింగు పబ్లికేషన్ కోడ్‌కు కుడి వైపున, సంచిక సంఖ్య, పేజీ సంఖ్యలకు ఎడమ వైపున ప్యాడింగ్ చేస్తారు. [1] పేజీ సంఖ్య 9999 కంటే ఎక్కువ ఉంటే M
కాలమ్‌లో కొనసాగుతాయి. [1]
ఉదాహరణలు
[మార్చు]బిబ్‌కోడ్‌లకు కొన్ని ఉదాహరణలు:
బిబ్‌కోడ్ |
---|
1974AJ.....79..819H
|
1924MNRAS..84..308E
|
1970ApJ...161L..77K
|
2004PhRvL..93o0801M
|
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "The ADS Data, help page". NASA ADS. Archived from the original on 14 October 2007. Retrieved November 5, 2007. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "b" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు