Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                

About Festivals

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

దసరా

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ


శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి
కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే
పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో
వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు
పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు
సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని
ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి
ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటదసరా పండుగ
విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు
జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ
తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా
పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం
ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన
సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను
తిరిగి తీసిన రోజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే
రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన
సందర్భమున 10 వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు,
అదే విజయదశమి

దీపావళి
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో
ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా
జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య
దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు
అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి
చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని
సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా
ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని
జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు
తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే
ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా
చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా
ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ
బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశి జరుపుకుంటారు.

ఈద్-ఉల్-ఫితర్
ఈద్-ఉల్-ఫితర్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే
ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్
నెలకు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి
వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక 30
రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల
ముగింపుగా దీన్ని జరుపుకుంటారు. దాంతో ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు
అవుతుంది. సాధారణంగా బహిరంగ స్థలంలో కానీ, భారీ హాలులో కానీ ఈ ప్రార్థన
చేస్తారు. చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై
ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను
ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో
జరుపుకుంటూంటారు.

క్రిస్మస్
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల
కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్
మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ
కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు
క్రైస్తవం) ఉపవాస దినాలకి ఆయన జన్మదినానికి 30 సంవత్సరాలు తేడా ఉంది
ఎవడో ఒక అబద్ధాన్ని ఇక్కడ క్రియేట్ చేశాడు ఉపవాస దినాలు తర్వాతనే
క్రిస్టమస్ అనేది వస్తుందని అది తప్పు వచ్చే క్రిస్మస్, క్రిస్మస్
టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు.
ఇవి, పన్నెండవ రోజు రాత్రికి ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి.) అని
పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది. ఇది ఒక అబద్ధం క్రీస్తు నిరంతరము
స్తోత్రర్హుడై ఉన్నాడు అని వ్రాయబడింది దాని కొంతమంది అబద్ధ బోధకులు
దీన్ని డిసెంబర్ నెలకే పరిమితం చేశారు.

సంక్రాంతి
సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని
మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.[1] అయితే
మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు
ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య
సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా
ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.[2] సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక
సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో
ప్రముఖంగా జరుపుకుంటారు . ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు
జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు.
మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని
ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి
రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ
పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో,
మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది

You might also like