1962
1962 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1959 1960 1961 1962 1963 1964 1965 |
దశాబ్దాలు: | 1940లు 1950లు 1960లు 1970లు 1980లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- మార్చి 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి రెండో పర్యాయం పదవిని చేపట్టాడు.
- ఏప్రిల్ 17: లోక్సభ స్పీకర్గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు.
- మే 30: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి.
- మే 13: భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని చేపట్టాడు.
- జూన్ 3: ఫ్రాన్సులో బోయింగ్ 707 విమానం దుర్ఘటన
- ఆగష్టు 24: నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి.
జననాలు
మార్చు- జనవరి 1: మారొజు వీరన్న, తెలంగాణ మహాసభ స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)
- జనవరి 12: రిచీ రిచర్డ్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- ఫిబ్రవరి 12: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
- ఫిబ్రవరి 12: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.
- మార్చి 2: యాకూబ్ (కవి), కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమం నిర్వాహకుడు.
- మార్చి 4: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.
- మార్చి 17: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003)
- ఏప్రిల్ 3: జయప్రద, తెలుగు సినీనటి.
- ఏప్రిల్ 7: రాం గోపాల్ వర్మ, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత.
- ఏప్రిల్ 7: కోవై సరళ, తెలుగు, తమిళ సినీ నటి.
- మే 27: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- జూలై 3: టామ్ క్రూజ్, అమెరికా దేశ నటుడు, చలన చిత్ర నిర్మాత.
- జూలై 6: ఎం. సంజయ్, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.
- జూలై 7: ఇందిర భైరి, గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని (మ. 2023)
- జూలై 28: కృష్ణవంశీ, తెలుగు సినిమా దర్శకుడు.
- ఆగష్టు 9: వెలుదండ నిత్యానందరావు, రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు.
- ఆగష్టు 10: లక్ష్మీపార్వతి, రచయిత్రి, హరికథా కళాకారిణి, నందమూరి తారక రామారావు రెండవ భార్య.
- ఆగష్టు 25: తస్లీమా నస్రీన్, బెంగాలీ రచయిత్రి.
- సెప్టెంబర్ 4: కిరణ్ మోరే, భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్.
- సెప్టెంబర్ 14: మాధవి, సినీ నటి.
- డిసెంబర్ 4: ఆర్.గణేష్, ఎనిమిది భాషలలో శతావధానం చేశాడు.
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 26: అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1882)
- మార్చి 28: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891)
- ఏప్రిల్ 12: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (జ.1861)
- మే 6: మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రకారుడు, శిల్పి, రచయిత. (జ.1910)
- జూన్ 13: కప్పగల్లు సంజీవమూర్తి ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894)
- జూలై 1: బి.సి.రాయ్, భారతరత్న గ్రహీతలైన వైద్యులు. (జ.1882)
- ఆగష్టు 5: మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (జ.1926)
- ఆగష్టు 5: ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (జ.1880)
- ఆగష్టు 11: పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు. (జ.1900)
- నవంబర్ 2: త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1910)
- నవంబర్ 18: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885)
- డిసెంబర్ 21: ఉప్మాక నారాయణమూర్తి, సాహితీవేత్త, అవధాని, న్యాయవాది. (జ.1896)
పురస్కారాలు
మార్చు- భారతరత్న పురస్కారం: రాజేంద్ర ప్రసాద్