1772

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1772 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1769 1770 1771 - 1772 - 1773 1774 1775
దశాబ్దాలు: 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • జనవరి 10: మొగలు చక్రవర్తి షా ఆలం II, పారిపోయిన 15 సంవత్సరాల తరువాత ఢిల్లీకి విజయవంతంగా తిరిగి వచ్చాడు.[1]
  • ఫిబ్రవరి 17: పోలెండ్ దేశం మొదటిసారిగా విభజించబడింది.
  • ఏప్రిల్ 13: వారెన్ హేస్టింగ్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ గవర్నర్‌గా తన సేవను ప్రారంభించి, కలకత్తా వెలుపల ఫోర్ట్ విలియం వద్ద ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు.[2] హేస్టింగ్స్ రెండు సంవత్సరాలు పనిచేసాక, భారత గవర్నర్ జనరల్ అయ్యాడు.
  • జూన్ 22: సోమర్సెట్ కేసులో ఇంగ్లాండ్, వేల్స్ ల లార్డ్ చీఫ్ జస్టిస్ లార్డ్ మాన్స్ఫీల్డ్, ఇంగ్లాండ్లో బానిసత్వం ముగించే తీర్పు ఇచ్చాడు.[3]
  • జూలై 13: న్యూజిలాండ్ కంటే దక్షిణంగా ఇంకా తెలియని ఖండం ఉనికిని నిరూపించే ప్రయత్నంలో జేమ్స్ కుక్ రెండవ సముద్రయానం మొదలైంది. కెప్టెన్ కుక్ కొత్త నౌక, హెచ్ఎంఎస్ రిజల్యూషన్, తోడు ఓడ హెచ్ఎంఎస్ అడ్వెంచర్ పై ప్లైమౌత్ నుండి బయలుదేరాడు.[4]
  • ఆగష్టు 12: జావా ద్వీపాలలో అగ్నిపర్వతం పగిలిన సంఘటనలో వేలమంది మరణించారు.[5]
  • డిసెంబర్ 14: బ్యుబోనిక్ ప్లేగు యొక్క అంటువ్యాధి కారణంగా మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ లలో 15 నెలల పాటు మూసేసిన రష్యన్ ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తెరిచారు.[6]
  • డిసెంబర్ 14: జేమ్స్ కుక్ రెండవ సముద్రయానం: HMS రిజల్యూషన్ సిబ్బంది, వారి ప్రయాణంలో ఎదురైన మంచు తుఫానులు మంచినీటికి వనరు అని కనుగొన్నారు. ఇది "సముద్రయానం విజయవంతం కావడానికి చాలా ప్రాముఖ్యత కలిగిన ఆవిష్కరణ".[7]
  • తేదీ తెలియదు: స్కాటిష్ శాస్త్రవేత్త డేనియల్ రూథర్‌ఫోర్డ్ నత్రజని వాయువును గాలి నుండి వేరుచేస్తాడు.[8]

జననాలు

[మార్చు]
రాజా రామమోహన్ రాయ్
  • జనవరి 30: గాడ్ఫ్రే హిగ్గిన్స్, బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త (మ .1833 )
  • మే 22: రాజా రామ్మోహన్ రాయ్, సుప్రసిద్ధ సంఘ సంస్కర్త. (మ.1833)
  • అక్టోబర్ 21: శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్, ఆంగ్ల కవి, తత్వవేత్త (మ .1834)
  • తేదీ తెలియదు: లాలోన్, బెంగాలీ తత్వవేత్త, బౌల్ సెయింట్, మార్మిక, పాటల రచయిత, సామాజిక సంస్కర్త, ఆలోచనాపరుడు (మ .1890)

మరణాలు

[మార్చు]
  • మార్చి 22: జాన్ కాంటన్, ఇంగ్లీష్ భౌతిక శాస్త్రవేత్త (జ .1718 )
  • అక్టోబర్ 16: అహ్మద్ షా దుర్రానీ, దురానీ సామ్రాజ్యం (క్యాన్సర్) ఆఫ్ఘన్ వ్యవస్థాపకుడు (జ .1724 )
  • తేదీ తెలియదు: మాధవరావు పీష్వా: భారతదేశపు మహారాజు.
  • తేదీ తెలియదు: మూడవ షాజహాన్ మొఘల్ వంశానికి చెందిన చక్రవర్తి. (జ.1711)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sharma, Yuthika (2012). "From Miniatures to Monuments: Picturing Shah Alam's Delhi (1771-1806)". In Patel, Alka; Leonard, Karen (eds.). Indo-Muslim Cultures in Transition. Leiden: Brill. p. 111.
  2. Jaswant Lal Mehta, Advanced Study in the History of Modern India 1707-1813 (Sterling Publishers, 2005) p. 510
  3. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. Weidenfeld & Nicolson. p. 327. ISBN 0-304-35730-8.
  4. Price, A. Grenfell, ed. (1971). The Explorations of Captain James Cook in the Pacific, as Told by Selections of His Own Journals, 1768-1779. Courier Corporation. p. 107.
  5. "Papandayan". Global Volcanism Program. Smithsonian Institution. Archived from the original on 2008-05-26. Retrieved 2010-09-09.
  6. John T. Alexander, Catherine the Great: Life and Legend (Oxford University Press, 1989) p159
  7. "Anders Sparrman, 1748—1820", in Oceanographic History: The Pacific and Beyond, ed. by Keith R. Benson and Philip F. Rehbock (University of Washington Press, 2002) p230
  8. Roza, Greg (2009). The Nitrogen Elements: Nitrogen, Phosphorus, Arsenic, Antimony, Bismuth. The Rosen Publishing Group, Inc. pp. 7–8. ISBN 978-1-4358-5335-5.
"https://te.wikipedia.org/w/index.php?title=1772&oldid=3843127" నుండి వెలికితీశారు