Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

అమృతం చందమామలో

వికీపీడియా నుండి
అమృతం చందమామలో
అమృతం చందమామలో సినిమా పోస్టర్
దర్శకత్వంగుణ్ణం గంగరాజు
నిర్మాతఊర్మిళ గుణ్ణం
తారాగణంశ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, ధన్య బాలకృష్ణ, సుచిత్ర
ఛాయాగ్రహణంరసూల్ ఎల్లోర్
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంశ్రీ
నిర్మాణ
సంస్థ
జస్ట్ ఎల్లో మీడియా[1]
విడుదల తేదీ
17 మే 2014 (2014-05-17)[1]
సినిమా నిడివి
140 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

అమృతం చందమామలో 2014, మే 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై గుణ్ణం గంగరాజు[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, ధన్య బాలకృష్ణ, సుచిత్ర తదితరులు నటించగా, శ్రీ సంగీతం అందించాడు. అంతరిక్ష హస్య నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు చిత్రమిది.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

1996లో లిటిల్ సోల్జర్స్ సినిమాకు పనిచేసిన దర్శకుడు గుణ్ణం గంగరాజు, సంగీత దర్శకుడు శ్రీ కొమ్మినేని, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ముగ్గురు మళ్ళీ ఈ చిత్రం కోసం కలిసి పనిచేశారు.[1] ఈ చిత్రాన్ని చందమామలో అమృతం పేరుతో నిర్మించారు, తరువాత అమృతం చందమామలో అని మార్చారు. ఈ చిత్రంలో హైదరాబాదుకు చెందిన లాఫింగ్ డాట్స్, ఇసిఎస్ కంపెనీలు చేసిన 60 నిమిషాల గ్రాఫిక్స్ ఉన్నాయి. రెడ్ ఎపిక్ కెమెరా ఉపయోగించి ఈ చిత్రం చిత్రీకరించబడింది.[1][3]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి శ్రీ సంగీతం అదించాడు.[4] ఇది శ్రీ సంగీతం అదించిన చివరి చిత్రం.[5]

సం.పాటగాయకులుపాట నిడివి
1."లక లక"శ్యామ్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ 
2."మూన్ లైట్ గర్ల్"దీపు, ఎంఎల్ఆర్ కార్తికేయన్, సాహితి గాలిదేవర 
3."పట పలాసుల"సాయి శ్రీకాంత్ 
4."బహుపరాక్"మనో 
5."యరుకగా"మనో 
6."ఏరువాక సాగారో"సాహితి గాలిదేవర 
7."ఘలాన్ ఘలాన్"సాయి శ్రీకాంత్ 

విడుదల

[మార్చు]
  1. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది.[3]
  2. దక్కన్ క్రానికల్ ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రం కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు మంచి వినోదాన్ని అందిస్తుందని తెలిపింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Krishnamoorthy, Suresh (May 9, 2014). "Family-entertainer with dollops of comedy". The Hindu.
  2. 2.0 2.1 "Movie review 'Amrutham - Chandamama Lo': Is a good laughing piece". Deccan Chronicle. May 18, 2014.
  3. 3.0 3.1 3.2 "Amrutham Chandamamalo Movie Review {3/5}: Critic Review of Amrutham Chandamamalo by Times of India". The Times of India.
  4. "Amrutham Chandamama Lo - Sree, Anantha Sriram - Download or Listen Free - JioSaavn". JioSaavn. Archived from the original on 2020-06-04. Retrieved 2020-08-02.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.

ఇతర లంకెలు

[మార్చు]