Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

ఇంగువ

వికీపీడియా నుండి

ఇంగువ
ఇంగువ చెట్టు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఫె. అసఫొటిడా
Binomial name
ఫెరులా అసఫొటిడా

ఇంగువ (Asafoetida) వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం, చాలా ఔషధ గుణాలున్న మొక్క. 'అస' అంటే పర్షియన్ లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్ధం. దీనిని ఇండో-ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని పిలుస్తారు. పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలాదినుసుల వాసననిస్తుంది.

ఇంగువ మొక్క

[మార్చు]

ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు.

  • దీనిని సంస్కృతంలో "హింగు" అంటారు.
  • ఇంగువ మొక్కలు గుబురుగా పొదలాగా ఉంటాయి. వీని కాండం సన్నగా బోలుగా ఉంటుంది.
  • ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది.
  • ఇది పసుపు రంగులో ఉండి బాగా తీవ్రమైన వాసనతో ఉంటుంది.
  • భారత దేశ వంటల్లో ముఖ్యంగా తెలుగువారి వంటింట్లో దీని స్థానం చెప్పుకోదగినది.

యిందులో గల పదార్థాలు

[మార్చు]

ఇంగువలో కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరటిన్, బి-విటమిన్.

ఉపయోగాలు

[మార్చు]

భారత దేశంలో దీని వాడకం ఏనాటినుంచో ఉంది. కడుపుని శుభ్రం చేసే సాధనాలలో ఇది చాలా ముఖ్యమైనది. అలాగే ప్రేవుల్లో వచ్చే నొప్పిని కూడా అది తగ్గిస్తుంది. నరాల బలానికి దీనిని వాడుతారు. మంచి జీర్ణకారి. నిద్రని పుట్టించే గుణం కూడా దీనిలో ఉంది దీనిని బ్రాంకయిటస్, అస్త్మా లలో వాడుకోవచ్చు. రెండు చెంచాల తేనెను 2,3 సెంటి గ్రాముల ఇంగువ పొడిని, తెల్ల ఉల్లి రసం, తమలపాకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశవ్యాధులు దూరంగా ఉంటాయి. హిస్టీరియాతో బాధపడే వారికి ఇంగువ వాసనని చూపిస్తే ఫలితం బాగుంటుంది. లైంగిక పటుత్వం తగ్గినవారిలో ఇంగువని వాడుకోవచ్చు. మర్రిపాలలో తేనెని కలిపి కొద్ది ఇంగువని కలిపి తీసుకుంటే 40 రోజులలో మంచి గుణం కనిపిస్తుంది. ఐరోపా దేశాల్లో చిన్న పిల్లల మెడలో దీనిని తాయెత్తులా కడితే చాలా రోగాలు దూరంగా ఉంటాయని వారు నమ్ముతారు. బహుసా దీనికి ఉందే తీవ్రమైన వాసన వలన చాలా సూక్ష్మ జీవులు దరిచేరవు. స్త్రీల సమస్యలకి కూడా ఇంగువని మంచి మందుగా వాడుకోవచ్చు. ముఖంగా పీరియడ్స్ లో వచ్చే నొప్పి, అధిక రక్తస్రావం, లుకేరియా, తరచూ ఎబార్షన్స్ కావడం లాంటి అనేక పరిస్థితులలో దీనిని వాడతారు. పై సమస్యలతో సతమతమయ్యేవారు నెలరోజుల పాటు రోజూ మూడు సార్లు ఇంగువని తేనెని మేకపాలతో కలిపి తీసుకుంటే చాల ఉపయుక్తంగా ఉంటుంది ఇలా చేయడం వలన స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పై ఇంగువ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ప్రసవానంతరం వచ్చే జీర్ణ వ్యవస్థకి వచ్చే అనేక సమస్యల్లో కూడా ఇంగువ ఉపకరిస్తుంది. ఇంగువని మన తెలుగు ఇళ్ళల్లో ముఖ్యంగా దీని జీర్ణకారి గుణం గురించి ఎక్కువగా వాడతారు. కడుపులో శబ్దాలు తగ్గాలన్నా, కడుపు ఉబ్బరంగా ఉన్నా, ఇంగువ అత్యంత ఉపయుక్తం. పంటి నొప్పి బాధిస్తుంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి ఒక దూదిలో ఉంచి పుప్పి పంటిలో ఉంచితే నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంగువని నల్లమందుకు విరుగుడుగా కూడా వాడతారు.నల్లమందు యొక్క చెడుగుణాల్ని ఇది తగ్గిస్తుంది.

ఔషధ గుణాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ఈనాడు ఆదివారం వ్యాసం 'గుబాళించే జిగురు' ఆధారంగా.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంగువ&oldid=2983663" నుండి వెలికితీశారు