Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

కర్కుమిన్

వికీపీడియా నుండి
కర్కుమిన్
Skeletal formula
Enol form
Skeletal formula
Keto form
Ball-and-stick model
Ball-and-stick model
పేర్లు
ఉఛ్ఛారణ /ˈkɜːrkjʊmɪn/
Preferred IUPAC name
(1E,6E)-1,7-Bis(4-hydroxy-3-methoxyphenyl)hepta-1,6-diene-3,5-dione
ఇతర పేర్లు
(1E,6E)-1,7-Bis(4-hydroxy-3-methoxyphenyl)-1,6-heptadiene-3,5-dione
Diferuloylmethane
Curcumin I
C.I. 75300
Natural Yellow 3
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [458-37-7]
పబ్ కెమ్ 969516
కెగ్ C10443
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:3962
SMILES O=C(\C=C\c1ccc(O)c(OC)c1)CC(=O)\C=C\c2cc(OC)c(O)cc2
  • InChI=1/C21H20O6/c1-26-20-11-14(5-9-18(20)24)3-7-16(22)13-17(23)8-4-15-6-10-19(25)21(12-15)27-2/h3-12,24-25H,13H2,1-2H3/b7-3+,8-4+

ధర్మములు
C21H20O6
మోలార్ ద్రవ్యరాశి 368.39 g·mol−1
స్వరూపం Bright yellow-orange powder
ద్రవీభవన స్థానం 183 °C (361 °F; 456 K)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references
పసుపు నుండి కర్కుమిన్ తీయు పరిశ్రమ
పసుపు నుండి గుళికలు చేయు యంత్రము
పసుపు నుండి కర్కుమిన్ వేరుచేయుఎక్సుట్రాక్టరులు
డిస్టిలెసన్ విభాగం

కర్కుమిన్ అనేది కుర్కుమా లాంగా జాతికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే ప్రకాశవంతమైన పసుపు రంగు రసాయనం. ఇది జింజిబెరేసి అనే అల్లం కుటుంబానికి చెందిన పసుపుకొమ్ము (కుర్కుమా లాంగా) యొక్క ప్రధాన కర్కుమినాయిడ్. ఇది మూలికా అనుబంధం , సౌందర్య సాధనాల పదార్ధం, ఆహార సువాసన మరియు ఆహార రంగుగా విక్రయించబడుతుంది.[1].


రసాయనికంగా, కర్కుమిన్ అనేది డయారిల్‌హెప్టానాయిడ్, ఇది కర్కుమినాయిడ్స్ సమూహానికి చెందినది, ఇవి పసుపుకొమ్ముకు పసుపు రంగుకు కారణమయ్యే ఫినోలిక్ పిగ్మెంట్‌లు.కర్కుమిన్, డైఫెరులోయ్‌మెథేన్ అని కూడా పిలుస్తారు, ఇది జింజర్ కుటుంబానికి చెందిన కర్కుమా జాతికి చెందిన కర్కుమా యొక్క రైజోమ్ నుండి తీసుకోబడిన హైడ్రోఫోబిక్ పాలీఫెనాల్ మరియు ఇది కర్కుమా లాంగా, కర్కుమా అమాడ, కర్కుమా జెడోరియా, సిరాకుమాటిక్ అరోమాటిక్,వంటి జాతులను కలిగి ఉంటుంది. [2]. ప్రయోగశాల మరియు క్లినికల్ పరిశోధనలు కర్కుమిన్ కోసం ఎటువంటి వైద్య ఉపయోగాన్ని నిర్ధారించలేదు. ఇది అస్థిరంగా మరియు జీవ లభ్యత తక్కువగా ఉన్నందున అధ్యయనం చేయడం కష్టం. ఇది ఔషధ అభివృద్ధికి ఉపయోగకరమైన లీడ్లను ఉత్పత్తి చేసే అవకాశం లేదని కొందరి అభిప్రాయం.

కర్కుమిన్ చాలా కాలంగా భారతీయ కూరలలో మసాలా మరియు సహజ రంగు ఏజెంట్‌గా ఉపయోగించబడింది, అలాగే చైనీస్ సాంప్రదాయ ఔషధాలలో ఒక భాగం. ఆహార పదార్థాల లో కలుపుటకు కర్కుమిన్ యొక్క E సంఖ్య (యూరోపియన్ యూనియన్ (EU) మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA)లో ఉపయోగం కోసం ఆహార సంకలనాలుగా ఉపయోగించే పదార్ధాలససంకేత పదం / కోడ్‌లు) E100. [3].

పసుపులోని పదార్ధాలు

[మార్చు]

పసుపు నుండి 100 కంటే ఎక్కువ భాగాలు వేరుచేయబడ్డాయి. వేరు నుండి సంగ్రహించిన పదార్థాలలో ప్రధాన భాగం అస్థిర నూనె(volatile oil)అనగా తక్కువ ఉష్ణోగ్రతలో వాయువుగా/ఆవిరిగా మారు ద్రవం , ఇందులో టర్మెరోన్ ఉంటుంది మరియు పసుపులో కర్కుమినాయిడ్స్ అని పిలువబడే ఇతర రంగు పదార్థం ఉన్నాయి. కర్కుమినాయిడ్స్‌లో కర్కుమిన్ డెమెథాక్సీకర్కుమిన్, 5'-మెథాక్సీకుర్కుమిన్ మరియు డైహైడ్రోకర్కుమిన్ ఉంటాయి, ఇవి సహజ యాంటీఆక్సిడెంట్‌లుగా గుర్తించబడ్డాయి (రూబీ మరియు ఇతరులు. 1995; సెల్వం మరియు ఇతరులు. 1995). సంగ్రహణ పదార్థాల శాతం , పసుపులో తేమ (>9%), కర్కుమిన్ (5–6.6%), అదనపు పదార్థం (<0.5% బరువు), మరియు వొలటైల్ నూనెలు (<3.5%) ఉంటాయి.[4].మ్

కర్కుమిన్ ను ఉత్పత్తి చేయుట

[మార్చు]

కర్కుమిన్ ను పసుపు నుండి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలో సంగ్రహించేదరు. సాల్వెంటు అనగా ఏదైన ఘన ,ద్రవ,లేదా వాయు పదార్థాలను కరిగించుకొనే స్వభావం,గుణం వున్నది. సాల్వెంటు లు సాధారణంగా ద్రవాలు అయ్యి వుంటాయి. కానీ ఘన మరియు వాయు రూపంలో వున్న సాల్వెంటు(ద్రావణి )లు కూడా వున్నవి. [5]. ద్రవ సాల్వెంటు లు పోలార్ మరియు నాన్ పొలారు అని రెండు రకాలు.పొలారు సాల్వేంటు లు ఆయన్స్ ను ఏర్పరచగా ,నాన్ పొలారు సాల్వేంటులు ద్రవంలో ఆయన్స్ (ions)ఏర్పరచవు . [6]నాన్ పొలారు ద్రవాలు సాధారణంగా నీటిలో కరగవు,కరిగిననను అత్యలప్ప ప్రమాణంలో వుండును. అలాగే పొలారు ద్రావణిలు నీటిలో త్వరగా కరుగుతాయి. కర్కుమిన్ ను ఇథైల్ అసిటెట్ అనే ద్రావణి(solvent)ని ఉపయోగించి పసుపు నుండి వేరు చేసిసంగ్రహిస్తారు. ఇథైల్ అసిటెట్ అనే ద్రావణి పాక్షికం గా పోలార్ మరియు నాన్ పొలారు లక్షణాలు కలిగివున్న ద్రావణి.ఇథైల్ అసిటేట్ అనేది ఎసిటిక్ ఆమ్లం మరియు ఇథనాల్ మధ్య ఏర్పడిన అసిటేట్ ఈస్టర్. ఇది అసిటేట్ ఈస్టర్, ఇథైల్ ఈస్టర్ మరియు అస్థిర కర్బన సమ్మేళనం.ఇది పోలార్ ద్రావణి గుణం కొంత వున్న కారణంగా నీటిలో 8.3% వరకు కరుగుతుంది. [7].

పసుపు కొమ్ము లేదా పసుపు పొడి నుండి నేరుగా కర్కుమిన్ ను వేరు చేయలేము. పసుపును మొదట మెత్తని పొడిగా చేసి, ఆ పొడిని పిల్లటైజరు అనే యంత్రంలో గుళికలు గా మార్చి ,తరువాత సాల్వేం టు సంగ్రహణ విధానం లో ఇథైల్ అసిటేట్ ను ద్రావణి గా వాడి కర్కుమిన్ ను వేరుచేస్తారు.లేదా కొన్ని పరిశ్రమలలో పసుపు కొమ్ములను ప్లెకర్ (flaker)అనే యంత్రంలో అటుకుల వంటి రూపంలోకి మార్చి,ఆ తరువాత సాల్వేంటు సంగ్రహణ విధానంలో ఇథైల్ అసిటేట్ ను ద్రావణి గా వాడి కర్కుమిన్ను వేరుచేస్తారు.బ్యాచి లేదా కంటిన్యూయస్ సాల్వేంటు సంగ్రహణ విధానంలో పసుపు నుండి కర్కుమిన్ ను వేరుచేస్తారు.

పసుపును,ఇథైల్ అసిటేట్ ను ద్రావణి గా వాడి సాల్వేంటు ఎక్సుట్రాక్షన్ చేసినపుడు,కర్కుమిన్ పసుపు లోనిమరికొన్ని ఇతర పదార్థాలతో కలిపి సంగ్రహణ అవుతుంది. ఇలా ఇతర పదార్థాలతో కలిసి ఉత్పత్తి అయిన చిక్కని ద్రవాన్ని ఒలియో రెజిన్(oleoresin)అంటారు. పసుపు నుండి 12-15% వరకు ఒలియో రెజిన్ ఉత్పత్తి అవుతుంది.[8].

కర్కుమిన్ ను ఉత్పత్తి చేయు యంత్రపరికారాలు-సంగ్రహణ విధానం

[మార్చు]

1.ఎక్సుట్రాక్టరు : ఇందులో పసుపు గుళికలు తీసుకుని ,పసుపు పరిమాణానికి నాలుగు నుండి ఆరు రెట్లు ఇథైల్ అసిటేట్ ద్రావణి ని తీసుకుని . దానిని 4-5 గంటలసేపు ఎక్సుట్రాక్టరులోని పసుపు గుళికల మీద నిరంతరం సర్కులేషన్ చేసేదరు. దాదాపు కర్కుమిన్ మరియు పసుపు లోని వొలటైల్ నూనెలు, స్థిర నూనెలు(కొవ్వు ఆమ్లాలు కలిగిన నూనెలు )అన్నియుఇథైల్ అసిటేట్ ద్రావణి లో కరుగును.ఇలా ఇతర పదార్థాలను కరిగించుకొన్న ద్రావణిని మిసెల్లా(miscella)అంటారు.

2.డిస్టీలేషన్: ఈ విభాగంలో మిసెల్లా అని పిలవబడే,పసుపులోని ఇతర పదార్థాలను కరిగించుకొన్న ఇథైల్ అసిటేట్ ద్రావణి నుండి,వాటిని వేరుచేయడం జరుగును. ఇలా ఇథైల్ అసిటేట్ ద్రావణి వేరు చేయబడిన చిక్కని ద్రావణంను ఒలియో రెజిన్ అంటారు.డిస్టి లేషన్ విభాగంలో హీటరులు,ఫ్లాసరులు మరియు కండెన్సరులువుండును. హీటరులలో మిసెల్లాను వేడిచేసి ఫ్లాసరు కు పంపిస్తారు.ఇందులో సాల్వేంటు ఆవిరి రూపంలోకి మారి,vకండెన్సరులకు వెళ్ళి తిరిగి ద్రవరూపంలోకి మారును.ఫ్లాసరులో సాల్వెంటు నుండి వేరుపడిన ఒలియో రెజిన్ను రియాక్టరుకు పంపిస్తారు.

3.రియాక్టరు విభాగం:ఈ విభాగంలో ఒలియో రెజిన్లో వున్న సాల్వెంటు శాతాన్నీతగ్గించెదరు. 4.శుద్ధికరణ విభాగం ;ఈ విభాగంలో ఒలియో రెజిన్ నుండి కర్కుమిన్ ను వేరుచేసే ప్రక్రియ జరుగును.

A.పరిపక్వత మరియు స్పటికరణ దశ: ఇక్కడఒలియో రెజిన్ కు కొంత ఐసొప్రొపెన్ ద్రావణి ని కలిపి 10-15 రోజులవరకు పరిపక్వత మరియు స్పటికరణ కై వదిలి వేస్తారు. వొలటైల్ ఆయిల్స్ మరియు స్థిర నూనెలు ఐసొప్రొపెన్ ద్రావణిలో కరుగగా, స్పటికరణ చెందిన కర్కుమిన్ ద్రవం అడుగు భాగంలో స్థిర పడును .

B.సెంట్రీ ఫ్యూజింగ్:పైనున్న వొలటైల్ ఆయిల్స్ మరియు స్థిర నూనెలు కరిగిన ఐసొప్రొపెన్ ద్రావణిని వేరు చేసి,కొంత వరకు ఇథైల్ అసిటేట్ నుకలిగిన కర్కుమిన్ ద్రవంను సెంట్రిఫ్యుజ్ కు పంపి అందు లోని అత్యధిక భాగం ద్రావణిని వేరుచేస్తారు.

c.వాక్యూం ట్రే డ్రైయింగు: ఈ పరికారంలో అర్ధ ద్రవస్థితిలో వున్నకర్కుమిన్ ను చిన్నట్రేలో నింపి, వాక్యుం డ్రయరులో వుంచి,వేడిగాలిని, అత్యంత వేగంగా డ్రయరులో ప్రసారిస్తారు.ఫలితంగా కర్కుమిన్ లోని మిగిలిన తేమ, సాల్వేంటు తొలగింపబడి, పసుపు రంగులో, పొడి రూపంలో కర్కుమిన్ ట్రేలలో వుండును.

అయితే ఈ విధంగా ఉత్పత్తి చేసిన కర్కుమిన్ లో ఇంకా ఇతర పదార్థాలు మలినరూపం (impurities) ఉండును.అట్టి వాటిని,కర్కుమిన్ ను రెండు, మూడుసార్లు ఐసో పోపనోల్ ఆల్కహాలుతో ఎక్సుట్రాక్షన్ చెయ్యడం ద్వారా తొలగించెదరు.

పసుపు నుండి కర్కుమిన్ ను బ్యాచ్ లేదా కంటిన్యూయస్ సాల్వేంటు ఎక్సుట్రాక్షన్ విధానం లో ఉత్పత్తి చేస్తారు. బ్యాచ్ పద్ధతిలో ,పసుపుగుళికలను నిలువు స్తూపాకరంగా ఉండే ఎక్సుట్రాక్టరు అనే ఉపకరణం /పరికరం లో తీసుకుని ,ఈథైల్ అసిటెట్ ను సాల్వేంటు గా ఉపయోగించి,4-5 గంటలసేపు పసుపు గుళికల మీద సర్కులేట్ చేస్తారు.ఇలా సర్కులేట్ చేసిన ఈథైల్ అసిటెట్ మరియు కర్కుమిన్ మిశ్ర మాన్ని వేరే నిల్వ పాత్ర/స్టోరేజి ట్యాంకునకు పంపి ,అక్కడి నుండి డిస్టిలెసను కు పంపి సాల్వెంటు ను కర్కుమిన్ వున్న ఒలియోరెసిన్ ను వేరుచేస్తారు.కర్కుమిన్ ను తొలగించిన,ఎక్సుట్రాక్టరులో వున్న పసుపు గుళికల్లో 40% వరకు సాల్వేంటు శోషింప బడి వుండును.జాకెట్ స్టీమ్ ద్వారా ఎక్సుట్రాక్టరు లోని పసుపు గుళికలను 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసిన, సాల్వేంటు వాయువుగా మారి, కండెన్సరు కు వెళ్ళి మళ్ళీ ద్రవ సాల్వేంటుగా మారును.బ్యాచ్ ఎక్సుట్రాక్షన్లో పసుపు గుళికలు ఎక్సుట్రాక్షను పూర్తి అయ్యే వరకు అందులోనే స్థిరంగా వుండును.కానీ కంటిన్యూయస్ విధానంలో ,ఎక్సుట్రాక్టరులో పసుపు గుళికలు ఎక్సుట్రాక్షన్ సమయంలో ఒకచివర నుండి మరో చివరకు కదులుతూ వుండును.అలాగే కంటిన్యూయస్ ఎక్సుట్రాక్షన్లో,పసుపు గుళికల్లో మిగిలిన సాల్వేంటును ప్రత్యేకంగా డిసాల్వేంటైజరు అనే పరికరంలోకి పంపి వేరుచేస్తారు.

కర్కుమిన్ ఉపయోగాలు

[మార్చు]

1.ఔషధ రంగంలో, కర్కుమినాయిడ్స్ ను ఎక్కువ ఇతర ఔషధ గుణాలు వున్న పదార్థాలలో కలిపి గుళికలు లేదా పౌడర్ రూపంలో అమ్ముతున్నారు.కర్కుమిన్ నరాలవ్యాధి నొప్పి, నిరాశ, ఆంజియో జెనిసిస్, ట్యూమోరిజెనిసిస్, మధుమేహం మరియు కాలేయం, చర్మం మరియు పల్మనరీ వ్యవస్థల వ్యాధులు, అలాగే హృదయ మరియు నాడీ వ్యవస్థల అణచివేతకు సంబంధించిన మందులలో ఉపయోగిస్తున్నారు.[9].

2.ఆస్టియో ఆర్థరైటిస్ (OA) అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులలో చేతులు, తుంటి, భుజాలు, పాదాలు, వెన్నెముక మరియు ముఖ్యంగా మోకాళ్ల వంటి కీళ్లను ప్రభావితం చేసే దీర్ఘకాలిక రుగ్మత i. కొంతమంది పరిశోధకులు పసుపులోని కర్కుమిన్ OA వలె క్షీణించిన వ్యాధుల చికిత్సలో ప్రయోజనకరమైన ప్రభావాలను ప్రదర్శిస్తాయని చూపించారు. [10].

౩.కర్కుమిన్ శోథ నిరోధక(anti inflammatory)మందుగా పనిచేస్తుందని తెలుస్తున్నది.[11].

4.కర్కుమిన్ ప్రాథమిక బయోయాక్టివ్ పదార్థం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది మరియు ఇది దీర్ఘకాలిక నొప్పి నుండి డిప్రెషన్ వరకు వివిధ పరిస్థితులను తగ్గించగలదని తగిన ఆధారాలు ఉన్నాయి.కర్కుమిన్ దాని స్వంత జీవ లభ్యత తక్కువ, అందువలన దీన్ని తరచుగా నల్ల మిరియాలునుండి ఉత్పత్తి చేసిన పైపెరిన్ లేదా లిపిడ్లతో కలిపి మార్కెటింగ్ చేస్తారు.[12]

5.ఇటీవల, న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ఆగమనాన్ని నివారించడానికి లేదా తగ్గించటానికి కర్కుమిన్ వాడకంపై శ్రద్ధ పెరుగుతున్నది . [13].

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Curcumin (Curcuma, Turmeric) and Cancer (PDQ®)–Health Professional Version". cancer.gov. Retrieved 2024-01-31.
  2. "Extraction, purification and applications of curcumin from plant materials-A comprehensive review". sciencedirect.com/. Retrieved 2024-01-30.
  3. "Extraction, purification and applications of curcumin from plant materials-A comprehensive review". sciencedirect.com/. Retrieved 2024-01-30.
  4. "Turmeric, the Golden Spice". www.ncbi.nlm.nih.gov. Retrieved 2024-01-30.
  5. "What is a Solvent?". toppr.com. Retrieved 2024-01-31.
  6. "solvent". britannica.com. Retrieved 2024-01-31.
  7. "Ethyl Acetate". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-01-31.
  8. "turmeric oleoresin". herbazest.com. Retrieved 2024-01-31.
  9. "Various Extraction Techniques of Curcumin—A Comprehensive Review". www.ncbi.nlm.nih.gov. Retrieved 2024-01-30.
  10. "Reflections about Osteoarthritis and Curcuma longa". ncbi.nlm.nih.gov. Retrieved 2024-01-31.
  11. "1. Curcumin Is an Anti-Inflammatory". everydayhealth.com. Retrieved 2024-01-31.
  12. "curcumin". examine.com. Retrieved 2024-01-01.
  13. "Benefits of curcumin in brain disorders". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-01.