క్షీణోపాంత ప్రయోజన సూత్రం
ఆర్ధికశాస్త్రంలో, ఒక ఉత్పత్తికి దోహదపడే కారకాల్లో ఒక్కటి తప్ప మిగతావన్నీ స్థిరంగా ఉండి, ఆ ఒక్క కారకం మాత్రమే పెరిగినపుడు, దానివలన ఏర్పడే ఉత్పత్తి పెరుగుదలలో (ఉపాంత ఉత్పత్తి) తగ్గుదల ఉండడాన్ని క్షీణోపాంత ప్రయోజనం అంటారు.
ఉత్పాదక ప్రక్రియలన్నిటి లోనూ, ఉత్పత్తికి సంబంధించిన కారకాల్లో ఒక్కటి తప్ప మిగతావాటిని స్థిరంగా ఉంచి, ఆ ఒక్క కారకాన్ని మాత్రమే పెంచితే ఉత్పత్తిలో కలిగే పెరుగుదల ఒక స్థాయి తరువాత తగ్గుతుంది అని క్షీణోపాంత ప్రయోజన సూత్రం చెబుతుంది [1] ఈ సూత్రం చెప్పేది ఉత్పత్తి తగ్గుతుంది అని కాదు, ఉత్పత్తిలో ఏర్పడే పెరుగుదల తగ్గుతుంది అని. ఏకంగా ఉత్పత్తే తగ్గిపోయే పరిస్థితిని ప్రతికూల రాబడి అని పిలుస్తారు.
ఫ్యాక్టరీలో కారును అసెంబ్లీ చేసే పనిలో ఉద్యోగాలకు ఎక్కువ మందిని జోడించడం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది కార్మికులను చేర్చుకుంటూ పోవడం వల్ల ఏదో ఒక స్థాయిలో కార్మికులు ఒకరికొకరు అడ్డం రావడం లేదా తమకు అవసరమైన భాగాల కోసం ఎదురుచూడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో, ఒక నిర్దుష్ట సమయానికి జరిగే ఉత్పత్తిని మరో యూనిట్ పెంచడానికి అవసరమైన ఇన్పుట్ వినియోగం పెరుగుతుంది -ఇన్పుట్ వినియోగం తక్కువ ప్రభావశీలంగా ఉంటుంది కాబట్టి. [2] బాగా అధ్యయనం చేసిన మరొక ఉదాహరణ -సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం మరింత మందిని నియోగిస్తే, బ్రూక్స్ సూత్రానికి దారితీస్తుంది .
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ఇంగ్లీషులో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్స్న్ అని అంటారు. ఇది ఆర్థిక శాస్త్రపు ప్రాథమిక సూత్రం. [3] ఉత్పత్తి సిద్ధాంతంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. [4]
మూలాలు
[మార్చు]- ↑ Samuelson, Paul A.; Nordhaus, William D. (2001). Microeconomics (17th ed.). McGraw-Hill. pp. 110. ISBN 0071180664.
- ↑ George, Henry. The Science of Political Economy. New York: Robert Schalkenbach Foundation. Archived from the original on 2019-02-26. Retrieved 2014-04-25.
- ↑ Samuelson, Paul A.; Nordhaus, William D. (2001). Microeconomics (17th ed.). McGraw-Hill. pp. 110. ISBN 0071180664.
- ↑ Encyclopædia Britannica. Encyclopædia Britannica, Inc. 26 Jan 2013. ISBN 9781593392925.