Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

గణేష్ హిమల్

అక్షాంశ రేఖాంశాలు: 28°23′33″N 85°07′48″E / 28.39250°N 85.13000°E / 28.39250; 85.13000
వికీపీడియా నుండి
గణేష్ హిమల్
గణేష్ హిమల్ పర్వత శ్రేణి. శిఖరాలు (ఎడమ నుండి కుడీకి): పేరు లేని శిఖరం (6250 m), గణేశ్-II, పబీల్, సాలసుంగో
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంయాంగ్రా
ఎత్తు7,422 మీ. (24,350 అ.)[1]
నిర్దేశాంకాలు28°23′33″N 85°07′48″E / 28.39250°N 85.13000°E / 28.39250; 85.13000[1]
భౌగోళికం
గణేష్ హిమల్ is located in Nepal
గణేష్ హిమల్
గణేష్ హిమల్
నేపాల్‌లో శ్రీణి స్థానం
దేశంనేపాల్
జిల్లాధాడింగ్ - గూర్ఖా సరిహద్దు
పర్వత శ్రేణిహిమాలయాలు
సరిహద్దులాంగ్‌టాంగ్ హిమల్, శృంగి హిమల్ and మాన్‌సిరి హిమల్

గణేష్ హిమాల్ అనేది ఉత్తర-మధ్య నేపాల్‌లో ఉన్న, హిమాలయాల ఉప-శ్రేణి. అయితే ఈ శ్రేణి లోని కొన్ని శిఖరాలు టిబెట్ సరిహద్దులో ఉన్నాయి. తూర్పున ఉన్న త్రిశూలి గండకి లోయ దీనిని లాంగ్టాంగ్ హిమాల్ నుండి వేరు చేస్తుంది; పశ్చిమాన ఉన్న బుధి (బురి) గండకి లోయ, శ్యార్ ఖోలా లోయలు దీనిని శృంగి హిమాల్, మన్సిరి హిమల్ (మనస్లు శిఖరం ఇక్కడే ఉంది) నుండి వేరు చేస్తాయి. [2]

శ్రేణిలో ఎత్తైన శిఖరం యాంగ్రా 7,422 మీ. (24,350 అ.) ఎత్తున ఉంది. 7,000 మీ. (23,000 అ.) కంటే ఎక్కువ ఎత్తున మరో మూడు శిఖరాలు, 6,000 మీ. (20,000 అ.) కంటే ఎక్కువ ఎత్తున పద్నాలుగు శిఖ్రాలూ ఉన్నాయి.

శ్రేణికి ఈ పేరు హిందూ దేవత గణేశుడి నుండి వచ్చింది. ఈ శ్రేణి లోని పర్వతాల పేర్లు, ఎత్తులను వివిధ వర్గాలను బట్టి విభిన్నంగా ఉంటాయి. విభిన్న శిఖరాలను సూచించడానికి అతి తక్కువ సందిగ్ధతతో కూడిన పద్ధతి "గణేష్ NW" లాగా రాయడం. కానీ ఈ శ్రేణికి సంబంధించిన సాహిత్యంలో ఇలా వాడలేదు

ఎత్తైన శిఖరాలు

[మార్చు]
శిఖరం[1] ఎత్తు (m) [2] ఎత్తు (ft) నిర్దేశాంకాలు[3] ప్రామినెన్స్ (m) [4] మాతృ పర్వతం మొదటి అధిరోహణ
యాంగ్రా (గణేష్ I/మెయిన్/NE) 7,422 24,350 28°23′33″N 85°07′48″E / 28.39250°N 85.13000°E / 28.39250; 85.13000 2,352 మానస్లు 1955
గణేష్ II/NW 7,118 23,353 28°22′45″N 85°03′24″E / 28.37917°N 85.05667°E / 28.37917; 85.05667 1,198 యాంగ్రా 1981
సాలసుంగో (గణేషు III/SE) 7,043 23,107 28°20′06″N 85°07′18″E / 28.33500°N 85.12167°E / 28.33500; 85.12167 641 గణేష్ IV 1979
పబీల్ (గణేషు IV/SW) 7,104 23,307 28°20′45″N 85°04′48″E / 28.34583°N 85.08000°E / 28.34583; 85.08000 927 గణేష్ II 1978

గమనికలు

[మార్చు]
  1. ^ గణేశ్ II, సాలసుంగో (గణేశ్ III), పబీల్ (గణేశ్ IV) అనే పేర్లు Finnmap నుండి వచ్చాయి.[3] దీని కంటే ముందు వచ్చిన Carter[2][4], Neate[5] (Carter నుండి ఉత్పన్నమైనది) ల లోని పేర్ల కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. Ohmori attests the name ఇక్కడ సాలసుంగో పేరుతో ఉన్న ఆగ్నేయ శిఖరానికి ఓహ్మోరి "లాప్సాంగ్ కార్బో" అనే పేరు పెట్టాడు.[6]
  2. ^ ఎత్తులు Finnmap చూపించినవి.[3]
  3. ^ నిర్దేశాంకాలు, ఎబర్‌హార్డ్ జుర్గాల్స్కీ Finnmap నుండి తెచ్చినవి.
  4. ^ ప్రామినెన్స్ విలువలు (యాంగ్రా తప్పించి) ఎబర్‌హార్డ్ జుర్గాల్స్కీ Finnmap నుండి తెచ్చినవి. యాంగ్రా విలువ, peaklist.org నుండి తెచ్చినది.[1]
  5. ధాడింగ్ ప్రదేశం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Tibet Ultra-Prominences". PeakList. Retrieved 3 January 2015.
  2. 2.0 2.1 . "Classification of the Himalaya".
  3. 3.0 3.1 Finnmap topographic map of the Ganesh Himal, produced for the Government of Nepal.
  4. American Alpine Journal 1989, p. 210.
  5. Neate, J. (1989). High Asia: An Illustrated History of the 7000 Metre Peaks. The Mountaineers. ISBN 978-0898862386.
  6. Ohmori, K. (1994). Over The Himalaya. Cloudcap Press (The Mountaineers). ISBN 978-0938567370.