Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

దేవప్రయాగ

అక్షాంశ రేఖాంశాలు: 30°08′47″N 78°35′54″E / 30.146315°N 78.598251°E / 30.146315; 78.598251
వికీపీడియా నుండి
దేవప్రయాగ
దేవప్రయాగ is located in Uttarakhand
దేవప్రయాగ
దేవప్రయాగ
భౌగోళికాంశాలు :30°08′47″N 78°35′54″E / 30.146315°N 78.598251°E / 30.146315; 78.598251
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నీలమేఘ పెరుమాళ్
ప్రధాన దేవత:పుండరీకవల్లి
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:మంగళతీర్థం
విమానం:మంగళ విమానం
కవులు:పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:భరద్వాజమహర్షికి

దేవప్రయాగ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

ఈ క్షేత్రము హరిద్వారము నుండి హిమవద్గిరికి పోవుదారిలో నున్నది. హరిద్వార్ నుండి ఈక్షేత్రమునకు పోవుమార్గంలోనే హృషీకేశ్ ఉంది. తపోవనము, లక్ష్మణస్వామి సన్నిధి (లక్ష్మణఝూలా) వ్యాసఘాట్-శ్రీసీతారాముల సన్నిధి ఉంది. హరిద్వారము నుండి 100 కి.మీ. దూరములో ఈ కండమెన్ఱుం కడినగర్ క్షేత్రము ఉంది. దీనినే దేవప్రయాగ అంటారు. కోవెలకు వెనుక హనుమాన్ సన్నిధి ఉంది. అలకనందా నది ప్రవహించు దేశము-ఆళ్వార్ కీర్తించిన పెరుమాళ్లను రఘునాథ్‌జీ అంటారు.

అలకనంద నది, భాగీరథి సంగమం, గంగా నది లేదా గంగా ప్రధాన కాండం ప్రారంభం

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీ మన్మంగళ పుణ్యతీర్థ రుచిరే క్షేత్రే ప్రయాగాభిదే
   త్వాలింగ్య ప్రియ పుండరీక లతికాం శ్రీ నీలమేఘో విభు:|
   రేజే మంగళ దేవయాన నిలయ:ప్రాగ్వక్త్ర సంస్థానగ:
   భారద్వాజ మునీక్షిత: కలిరిపు శ్రీవిష్ణుచిత్త స్తుత:||

పాశురాలు

[మార్చు]

పా. తజ్గై యై మూక్కుమ్‌ తమయనై త్తలయుమ్‌ తడన్దవెన్ దాశరదిపోయ్
   ఎజ్గుమ్‌ తన్ పుకழா విరున్దరశాణ్డ; వెమ్బురుడోత్తమ నిరుక్కై,
   కజ్గై కజ్గై యెన్ఱ వాశకత్తాలే; కడువినై కళైన్దిడు కిఱ్కుమ్‌
   కజ్గై యిన్ కఱై మేల్ కైతొழுనిన్ఱ కణ్డమెన్నుమ్‌ కడినకరే||
           పెరియాళ్వార్లు-పెరియాళ్వార్ తిరుమొழி 4-7-1

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నీలమేఘ పెరుమాళ్ పుండరీకవల్లి మంగళతీర్థం తూర్పుముఖము నిలచున్న భంగిమ పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ మంగళ విమానం భరద్వాజమహర్షికి
అలకనంద నది, భాగీరథి సంగమం, గంగా నది లేదా గంగా ప్రధాన ప్రారంభం

మంచిమాట

[మార్చు]
  • ఆశ్రయింప వలసిన వానిని అన్నిటిని ఆశ్రయించి భగవంతుని కూడా ఆశ్రయించుట "భక్తి".
  • విడువ వలసిన వాటి నన్నింటిని విడచి తనను కూడా విడుచుట "ప్రపత్తి".
అలకనంద (ఎడమ), భాగీరథి (కుడి) నదుల సంగమం దేవప్రయాగ్ వద్ద గంగను ఏర్పరుస్తుంది

చేరే మార్గం

[మార్చు]

హృషికేశ్ నుండి బదరీమార్గంలో 70 కి.మీ దూరంలోను హరిద్వార్-బదరీ మార్గంలో 95 కి.మీ. దూరంలోను గలదు

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]