Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

పురుష లైంగికత

వికీపీడియా నుండి
పురుష లైంగికతను సూచించే (రోమన్ దేవుడు) మార్స్ యొక్క ఆయుధాలు; డాలు, ఈటె
ఈశ్వర్ సత్య హై

సత్య హీ శివ్ హై
శివ్ హీ సుందర్ హై
సత్యం శివం సుందరం '

సత్యం శివం సుందరం అనే చిత్రంలో పాట భాగం

పై పాటలోని భాగం యొక్క అర్థం

ఈశ్వరుడే సత్యము
సత్యమే శివుడు
శివుడే సుందరుడు
సత్యం శివం సుందరమంటే ఇదే.'

-- లతా మంగేష్కర్ ఆలపించిన, వేకువ ఝామునే శివుని స్తుతిస్తూ, ఆ కుగ్రామంలో శివాలయాన్ని శుభ్రపరచే యువతిగా జీనత్ ఆమన్ నటించిన ఈ గీతం ఏ హిందువు మరువలేనిది. హైందవ ధర్మంలోని భక్తి/ఆధ్యాత్మికతలోనే పురుష లైంగికత శివుని రూపంలో నిగూఢమై ఉన్నదని, అది సత్యమని, అదే సుందరమని ఈ గీతం స్పష్టంగా తెలియజేస్తుంది!!

పురుష లైంగికత (ఆంగ్లం: Human Male Sexuality) అనగా పురుషుల శారీరక/మానసిక/సాంఘిక/సాంస్కృతిక/రాజకీయ లైంగిక స్వభావము, లైంగిక వాంఛలు, లైంగిక చర్యలు, లైంగిక స్పందనలు, వాటి సంబంధిత ప్రక్రియలు. పురుషుల లైంగికతకు సంబంధించిన నీతినియమాలు, మతంలోని పురుష లైంగికతలు కూడా పురుష లైంగికతలో భాగాలే.

నేపథ్యం

అనాదిగా పురుష లైంగికత స్త్రీపురుషులిరువురికీ సమానంగా ఆనందోత్సాహాలని ఇచ్చింది. లలిత కళలలో, సంగీతంలో, సాహిత్యంలో అనేకానేకులకు ప్రేరణగా నిలిచింది. జీవరాశి జవసత్వాలతో కొనసాగటానికి భూమిపై జనాభివృద్ధికి కారణభూతమైనది. అయిననూ పురుష లైంగికత సానుకూల అభిప్రాయాన్ని మాత్రం పొందలేకపోయింది.[1]

ప్రస్తుత సభ్యసమాజం పురుష లైంగికతను హేయమైనదిగా, మొరటుదనం గలదిగా, మృగతృష్ణగా పొరబడుతోంది. కానీ ఈ దురభిప్రాయానికి విరుద్ధంగా స్త్రీ లైంగికత ఎంత భిన్నమైనదో, క్లిష్టమైనదో, అద్భుతమైనదో పురుష లైంగికత కూడా అంతే భిన్నం, క్లిష్టం, అద్భుతం.

హైందవంలో పురుష లైంగికత

శివ-పార్వతుల సంగమ సూచిక, యోనిలో ప్రతిష్ఠించబడిన లింగం

హిందూమతములో సృష్టి ప్రారంభం నుండే మానవ లైంగికతకు ప్రాధాన్యత ఉంది. దీనిలో భాగంగానే పురుష లైంగికత, స్త్రీ లైంగికతలు అనాదిగా ప్రస్తావించబడినవి.

శైవం

ప్రకృతి ఆహ్వానాన్ని అందుకుని పురుషుని రూపంలో అవతరించిన శివుడు. శివుడు కూడా ఆది పరాశక్తిలో భాగమే

శివుడి మూర్తీభవించిన రూపమే కాలగతికి చిహ్నం. ఆది పరాశక్తి యొక్క శక్తితో శివుడిలో చలనము కలుగుతుంది. ఈ శక్తితోనే శివుడు విశ్వవినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడౌతాడు. మహాశక్తియే శివుడి భార్య.

  • శివ లింగము, శివుడి పురుషాంగం. శివ లింగము పురుష లైంగికతకు ప్రతీక.
  • లింగ యోని, ఆది పరాశక్తి యొక్క యోని. ఇదే మహాయోని, స్త్రీ సృజనాత్మక శక్తికి ప్రతీక.
  • శివ లింగము యొక్క పరిపూర్ణ రూపం, లింగ యోనిలో అమర్చబడిన లింగము. లింగ యోనుల సంగమం స్త్రీ శక్తియైన నిష్క్రియాత్మక విశ్వం, పురుష శక్తియైన క్రియాత్మక గతుల (కాలాల) అద్వైత ఐక్యతను (ఒకదానితో మరొకటి అల్లుకుపోయి, విడదీయలేనంత బంధాన్ని) సూచిస్తుంది. ఇదే జీవరాశి యొక్క ఉద్భవంగా ఘోషిస్తుంది
  • లింగానికి చేసే ప్రత్యేక పూజలు, భక్తులు లింగాన్ని తమ చేతితో స్పృశించటం, తమ తలను లింగానికి ఆన్చటం వంటివి పురుషాంగం పై గౌరవభావం నెలకొల్పటానికి నిర్దేశించబడినవి
  • లింగాన్ని నేతితో, నూనెతో పులమటం సంభోగానికి ముందు పురుషాంగం యొక్క సారళ్యతను సూచించుటకు కొరకు నిర్దేశించబడినది
  • శివుడు అభిషేక ప్రియుడని తెలపటం, శివ లింగాన్ని పంచామృతాలతో అభిషేకించటం, పురుష జాతిని లైంగికత ద్వారా ప్రసన్నం చేసుకొనటం, పురుషులను సుఖసంతోషాలతో ఉంచటం కొరకు నిర్దేశించబడినవి

శాక్తేయం

ప్రరబ్రహ్మ స్వరూపం, పరమసత్యం ఆది పరాశక్తి

భూమిపై ప్రకృతిగా అవతరించిన ఆది పరాశక్తి పరబ్రహ్మ స్వరూపం. పరమసత్య స్వరూపం. సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి. ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఈ జగత్తుకు శివుడిని పురుషుని రూపంలో ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతోంది.

అద్వైతం

మోహిని రూపంలో నున్న శ్రీ మహా విష్ణువు

మహిషాసురుడి సోదరియైన మహిషి, అతని సంహరించిన దేవతలపై పగ సాధించాలని బ్రహ్మ కోసం తపస్సు చేసి అతడిని ఈ విధంగా కోరినది:
శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అది కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి.
బ్రహ్మ మహిషికి ఆ వరం ప్రసాదించి అదృశ్యమైపోతాడు.

క్షీరసాగరమథనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో శాస్త (అయ్యప్ప) జన్మించాడు.

  • ఈ ఘట్టంలో హరి మోహినిగా అవతరించటం పురుషులలో ట్రాన్స్-సెక్సువలిజాన్ని సూచిస్తుంది.
  • హరి గర్భం దాల్చటం, నేటి సాంకేతిక విప్లవంతో పురుషులు కూడా గర్భం దాల్చటం సూచిస్తుంది.
  • హరిహరుల సంగమం పురుష స్వలింగసంపర్కాలను సూచిస్తుంది.

అర్ధనారీశ్వర, బృహన్నల, శిఖండి అవతారాలు నపుంసకులను సూచిస్తాయి.

తంత్ర శాస్త్రము

యాబ్-యుం ల అనంత కౌగిలి.
  • తంత్ర దర్శనము ప్రకారం స్త్రీ సౌందర్యానికి సూచిక, పురుషుడు మగసిరికి సూచిక; అయితే నపుంసకులు రెంటికీ సూచికలు.
  • తంత్ర శాస్త్రం బోధించే ప్రధాన విషయాలలో ఒకటి, వ్యతిరేక శక్తుల సంగమమే అనంత సౌఖ్యానికి దారి.
  • పురుష శక్తి కరుణ, ఉపాయాలకి సంకేతము. స్త్రీ శక్తి ప్రజ్ఞకి సంకేతము. శివ-శక్తుల (బౌద్ధంలో యాబ్-యుం ల) అనంత కౌగిలి గురించి, ఈ భంగిమలో అనుసంధానించబడే వ్యతిరేక శక్తుల గురించి, దీనిని అవలంబంచటంలో పొందగలిగే సత్ఫలితాల గురించి నవ తంత్రములో విస్తృతంగా చర్చించబడింది. అంతే కాక ఈ భంగిమ ద్వారా సాధారణ గృహస్థు లైంగిక పారవశ్యాన్ని ఎలా పెంచుకొనవచ్చునో కూడా నవ తంత్రము తెలుపుతుంది
  • తంత్ర దర్శనములో ప్రధాన యంత్రమైన శ్రీ చక్రానికి నవయోని చక్రమని పేరు.
  • దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది.
  • శ్రీ చక్రయంత్రములో మధ్యనున్న బిందువు సర్వ ఆనందమయి

ఇతర మతాలలో పురుష లైంగికత

ఇతర మతాలు కూడా పురుషాంగం యొక్క ప్రాధాన్యతను గుర్తించాయి. పురుషాంగం

  • పురుష లైంగికత
  • సంతానోత్పత్తి
  • శుభం
  • శక్తి
  • సాహసం
  • రక్షణ
  • బ్రహ్మచర్యం
  • మానవ జీవిత చక్రం

మొదలగు వాటికి సంకేతాలుగా గుర్తించబడింది.

కారకాలు

పురుష లైంగికత యొక్క కారకాలు ఈ క్రింది అంశాలను బట్టి ఉంటాయి.

  • వ్యక్తిత్వం
  • లైంగికత గుర్తింపు (Sexual Identity)
  • శరీర నిర్మాణం
  • లైంగిక వాంఛ
  • లైంగికత దిశ (Sexual Orientation)
  • నమ్మకాలు,
  • భావనలు

పురుషులు తమని తాము అర్థం చేసుకోకుండా, తమకు కావలసిందేమిటో తెలుసుకోకుండా దూసుకుపోవాలనుకోవటం వలన తమను తాము పురుషులుగా స్థాపించుకోలేక, కావలసినది అందుకోలేక అర్థం లేని పోటీతత్వంలో ఇరుక్కుపోతారు.

లైంగిక ఆకర్షణ

ఈ క్రింది ఆకర్షణలలో కొన్ని సరి అనిపించిననూ, మరికొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేసిననూ ఇవి వాస్తవాలు. పైగా పురుషుని అనుభవంలో ఇవి ఆరోగ్యకరం, సహజం, సాధారణం.[2]

  • కొందరు పురుషులు స్త్రీల చే ఆకర్షించబడతారు
  • కొందరు పురుషులు స్త్రీపురుషులిరువురిచే ఆకర్షించబడతారు
  • మరికొందరు పురుషులు ఎవరిచే ఆకర్షించబడరు

లైంగిక ప్రవర్తన

మొదటి నుండి స్త్రీలతో పోలిస్తే పురుషులలోనే లైంగిక ఆసక్తి ఎక్కువ అనే నానుడి ఉంది. ఇందులో ఎంతోకొంత సత్యం లేకపోలేదు.[3]

  • పురుషులలో లైంగిక వాంఛలు ఎక్కువే
  • దుష్పరిణామాలను/ప్రమాదాలను లెక్క చేయక, పురుషులు లైంగికంగా దుందుడుకు స్వభావం కలిగి ఉంటారు
  • తమ భాగస్వామితో తరచు సంభోగంలో పాల్గొనకపోతే అసంతృప్తులుగా అనాసక్తంగా మారిపోతారు
  • తాము ప్రేమించే వారు తమ లైంగిక చేష్టలను ఆమోదించకపోతే వారిలో శూన్యత ఆవహిస్తుంది
  • స్త్రీల కంటే త్వరగా, స్వల్ప విషయాలకే లైంగికంగా ప్రేరేపించబడతారు.

లైంగిక స్పందన

లైంగిక ప్రేరేపణను అందించే స్పర్శ, వాసన, చూపు, ఆలోచన లేదా ఊహ పురుషులలో లైంగిక స్పందనను కలుగజేస్తుంది. సాధారణ స్థితిలో పురుషాంగం లోనికి ప్రవహించే రక్తం, పురుషాంగం నుండి బయటకు ప్రవహించే రక్తం సమపాళ్ళలో ఉంటుంది. అయితే, అంగస్థంబన జరుగుతూ ఉన్న సమయంలో బయటకు ప్రవహించే రక్తం కన్నా లోనికి ప్రవహించే రక్తం క్రమంగా హెచ్చుతుంది. దీంతో చాలా రక్తం పురుషాంగం లోనే బంధించబడి ఉంటుంది. అందుకే అది వ్యాకోచించి గట్టిపడుతుంది. వృషణాలు పరిమాణంలో పెరగటం, చనుమొనలు గట్టిపడటం లేదా నిక్కబొడుచుకొనటం, అధిక రక్తప్రసరణ జరిగిన చోట చర్మం ఎర్రబడటం జరుగుతాయి. రక్త పీడనం, గుండె వేగం, శ్వాసవేగం కూడా పెరుగుతాయి. శరీరం ఆసాంతం కండరాలలో పట్టు పెరుగుతుంది. తర్వాత పురుషుడు సంభోగానికి ఉపక్రమిస్తాడు.

పురుషుల భావప్రాప్తి జరిగేముందు అది జరగబోతోందని వారు గ్రహించగలరు. వీర్య స్ఖలనం 2-3 సెకన్ల పాటు జరుగుతుంది. భావప్రాప్తి జరిగే సమయంలో కండరాలు కుంచించుకుపోతాయి. వారు తీవ్రమైన, ఆనందకరమైన భావాలకు లోనవుతారు. సౌఖ్యాన్ని అందించే ఈ భావోద్రేకాలతో వారు తీయగా ముక్కటం, మూల్గటం, అరవటం/కేకలు వేయటం, రొప్పటం, శ్వాస/దంతాలు బిగపట్టటం, భాగస్వామిని గట్టిగా హత్తుకోవటం/గాఢంగా చుంబించటం, పిడికిళ్ళు బిగించటం, భాగస్వామి అరచేతులను తమ అరచేతులతో నులమటం వంటివి చేస్తారు. ఈ క్రమంలోనే పురుషాంగం వీర్యాన్ని స్ఖలిస్తుంది. కాళ్ళు, ఉదరభాగం, చేతులు, వీపు, పురుషాంగం ఆకస్మికంగా పలుమార్లు కుంచించుకుపోయి తిరిగి చైతన్యవంతం అవ్వటం గమనించవచ్చును. వీర్యం ఒక్క ఉదుటున బయటకు దూకటమో, లేక మెల్లగా ఊటలా ఊరటమో జరుగుతుంది. పురుషుడికి సడలిపోయిన, ప్రశాంతమైన భావన కలుగుతుంది. విశ్రాంతిగా అనిపిస్తుంది. పురుషాంగంలోకి రక్తప్రసరణ తరుగుతూ వస్తుంది. పురుషుడు నిదానిస్తాడు. రక్తప్రసరణ తిరిగి సమస్థితికి చేరుకొనగనే అంగం పూర్తిగా మెత్తబడి యథాస్థితికి చేరుకొంటుంది. ఇక మరికొంత సమయం వరకు పురుషునిలో అంగస్థంబనగానీ, వీర్యస్ఖలనం గానీ జరగవు. దీనినే వక్రీభవన కాలము (refractory period) అంటారు. వక్రీభవన కాలము యొక్క నిడివి పరిస్థితులను బట్టి, వయస్సును బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది.

పురుషుని లైంగిక స్పందనలు పలు కారకాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  • (లైంగిక) ఆరోగ్యం
  • గత అనుభవాలు
  • లైంగిక వైఖరులు
  • భాగస్వామితోనున్న సంబంధం

వీర్యస్ఖలనం, భావప్రాప్తి

సాధారణంగా పురుషులకు వీర్యస్ఖలనం, భావప్రాప్తి ఒక్కటే. సాంకేతికంగా ఇవి రెండు వేర్వేరు అంశములు.

కారణాలు

  • వీర్యస్ఖలనం చేస్తేనే భావప్రాప్తి కలుగుతుందని, భావప్రాప్తి కలిగినపుడు కచ్చితంగా వీర్యస్ఖలనం జరుగుతుందనే అభిప్రాయాలు మనసులోతుల్లో నాటుకు పోయి ఉండటం
  • భావప్రాప్తి కోసం అర్రులు చాస్తూ తొందరపడటం
  • హస్తప్రయోగం చేస్తూ ఉండే సమయంలో ఎవరైనా చూస్తారేమో నన్న సంశయం. త్వరగా ముగించేయాలనే ఆదుర్దా ఉండటం
  • సంయోగం జరిగే ప్రదేశం వ్యక్తిగతం కాకపోవటం. అక్కడికి ఎవరైనా వస్తారేమో నన్న భయం
  • పని వత్తిడి. స్ఖలించేస్తే తన బాధ్యత తీరిపోతుందనే భావన
  • తగినంత ఉపరతి జరుగకపోవటం
  • శీఘ్రస్ఖలనాన్ని ఎలా నిరోధించవచ్చో, అందులో మెళకువలు ఏంటో తెలియక పోవటం

నవ తంత్రములో దీని గురించి విస్తృతంగా చర్చించబడింది. స్ఖలించకనే భావప్రాప్తి ఎలా పొందవచ్చును? ఒకే సంయోగంలో పలుమార్లు ఎలా భావప్రాప్తి పొందవచ్చును? తను స్ఖలించాలనుకొన్నప్పుడే పురుషుడు ఎలా స్ఖలించవచ్చునో, ఇందులో మెళకువలు ఉన్నాయి.

అంగస్థంబన సమస్యలు

ప్రతి పురుషుడు కొండకచో అంగస్థంబన సమస్యలు ఎదుర్కొంటారు. ఇది సర్వసాధారణం. ఎపుడో ఒక మారు ఈ సమస్యను ఎదుర్కొన్నంత మాత్రాన నపుంసత్వం ఆవహించినట్లు కాదు. కొందరు పురుషులలో హస్తప్రయోగం సమయంలో అంగం స్థంబించిననూ, భాగస్వామితో సంభోగానికి పూనుకొన్నపుడు మాత్రం సమస్యగా ఉంటుంది. ఇది ఎంతమాత్రం విచిత్రం కాదు.

దీనికి పలు కారణాలు ఉండవచ్చును.

  • నిత్యజీవితంలో పురుషుడు నిర్వహించవలసినస పాత్రలు, బాధ్యతల వలన పురుషుడు ఎదుర్కొనే ఒత్తిడి. ఉదా:ఉద్యోగిగా, తండ్రిగా, సోదరునిగా, పుత్రునిగా, గృహస్థుగా, లైంగిక భాగస్వామిగా
  • గత చేదు అనుభవాల కారణంగా. ఉదా: లైంగిక దాడికి గురై ఉండటం, లైంగికంగా దుర్వినియోగం చేయబడి ఉండటం, గర్భం తెస్తానేమోనన్న/సుఖవ్యాధులు సోకుతాయేమోనన్న భయం
  • ఆరోగ్య కారణాల దృష్ట్యా వినియోగిస్తున్న ఔషధాల ప్రభావం
  • మాదకద్రవ్యాల, మత్తు పానీయాల ప్రభావం
  • ఇతర అనారోగ్యం (డయాబెటిస్, రక్త పీడనం వంటి అనారోగ్యాలు)
  • వెన్నెముకకైన గాయాలు, ఇతర గాయాలు
  • హార్మోన్ల ప్రభావం

సాధారణంగా యువకులైన పురుషులలో మానసికాందోళనల వలన, వయసు పై బడిన వారిలో శారీరక కారణాల వలన ఈ సమస్య ఎదురౌతుంది.

పరిష్కార మార్గాలు

  • పురుషులు నపుంసత్వం గురించిన భయాందోళనలు వీడాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి
  • లైంగిక ఆసక్తి, లైంగిక సామర్థ్యం కేవలం పురుషుల సొత్తు అని సంస్కృతి మనపై రుద్దిన దురభిప్రాయం నుండి బయటపడాలి
  • ఎప్పటికప్పుడు భావప్రకటనలు చేసుకొంటూ ఉండాలి. లేకపోతే చిన్నచిన్న పొరపొచ్ఛాలే పెద్ద అభిప్రాయభేదాలకు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల భాగస్వాములకు మధ్య క్రమంగా దూరం పెరిగిపోయే ప్రమాదం ఉన్నది
  • ప్రతిమారు ఇదే సమస్య తారసపడితే మాత్రం భాగస్వాములిరువురూ వైద్యుని సంప్రదించాలి

శీఘ్ర స్ఖలనం

ఒత్తిడి, ఆందోళనలలో ఉన్న సమయాలలో శీఘ్ర స్ఖలనం సర్వసాధారణం. అయితే ఏది శీఘ్రస్ఖలనం, ఏది కాదు అనేది చర్చించవలసిన అంశం. సాధారణంగా పురుషుడు తాను స్ఖలిస్తాననుకొన్న సమయం కన్నా ముందే స్ఖలించటం, లేదా భాగస్వామిని సంతృప్తి పరచే లోపే స్ఖలించటాన్ని శీఘ్రస్ఖలనంగా పరిగణించవలసి ఉంటుంది. చాలా మంది పురుషులు, స్థంబించిన పురుషాంగాన్ని యోని లోకి ప్రవేశపెట్టిన 2-3 నిముషాలకు స్ఖలిస్తారు. (పుస్తకాలు, చిత్రాలు, పుకార్లు ఈ నిడివిని అతిశయంగా పెంచి గంటల తరబడి పురుషులు సంభోగించటం వంటివి చెప్పటం/చూపటం చేస్తాయి. కానీ ఇది వాస్తవం కాదు.) అదే స్త్రీలకైతే భావప్రాప్తి పొందటానికి సంభోగ సమయం 12-14 నిముషాల నిడివి అవసరం ఉంటుంది. కానీ ఈ సంభోగ సమయం ఆసాంతం యోని సంభోగమే అవ్వవలసిన అవసరం లేదు. కేవలం యోని సంభోగంతోనే వారు భావప్రాప్తి చేరుకొనరు. స్త్రీ భావప్రాప్తి పొందుటకు చుంబనం, స్పర్శ, యోనిశీర్ష ప్రేరేపణ వంటి ఇతర అనేక చర్యల అవసరం అవుతాయి. వాస్తవానికి కొంత మంది స్త్రీలు హస్తప్రయోగం చేసేటప్పుడు ఎటువంటి యోని సంభోగం లేకుండానే కేవలం యోనిశీర్ష ప్రేరేపణ తోనే భావప్రాప్తి పొందగలరు.

పరిష్కార మార్గాలు

  • శీఘ్రంగా స్ఖలిస్తోన్నామని అనుకొనే వారు నిదానాన్ని అలవర్చుకోవాలి. మధ్య మధ్యన (ప్రత్యేకించి స్ఖలించబోతోన్నామని అనిపించే ముందు) సంభోగానికి విరామాన్నిస్తూ, దీర్ఘంగా శ్వాసిస్తూ, తిరిగి ప్రారంభిస్తూ ఉండటం నేర్చుకోవాలి. సంభోగ సమయంలో ఇది ఇబ్బందిగా ఉంటే మొదట హస్తప్రయోగంలో దీనిని కొంతమేరకు అభ్యసించి, ఇదే అభ్యాసాన్ని సంభోగానికి వర్తింపజేయాలి. విరామాన్నిచ్చినపుడు స్ఖలనాన్ని ఆపుకోలేకపోతుంటే స్వంతంగా గానీ, భాగస్వామి గాని స్ఖలనం అవకుండా ప్రురుషాంగ రంధ్రం వద్ద సున్నితంగా వ్రేళ్ళతో అదిమి పట్టి ఉంచవచ్చును.
  • కెగెల్ ఎక్సర్సైజు చేయటం. మూత్రవిసర్జన చేసే సమయంలో మధ్యలో హఠాత్తుగా ఆపే ప్రయత్నం చేయటం. ఇలా చేయటం వలన మూత్రనాళం, దాని చుట్టూ ఉండే PC కండరాలపై పురుషునికి నియంత్రణ పెరుగుతుంది. తద్వారా స్ఖలనాన్ని నియంత్రించవచ్చును. (ఈ ఎక్సర్సైజు మూత్ర విసర్జన చివరి వరకూ చేస్తే, విసర్జన నొప్పికి దారి తీయవచ్చును. కావున మొదటే రెండు-మూడు మార్లు ఆపే ప్రయత్నం చేసి, చివరన సాధారణ మూత్ర విసర్జన చేయటం ఉత్తమం.)
  • పురుషుడు స్త్రీ పైన ఉండి సంభోగించే భంగిమలను కాకుండా, స్త్రీయే పురుషుని పై ఉండి సంభోగించే భంగిమలను అనుసరించాలి. దీని వలన స్త్రీకి పురుషుడిపై నియంత్రణ ఉంటుంది. పురుషుడికి అనవసర ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉండటంతో స్ఖలనం నిదానిస్తుంది.
  • కండోమ్ వాడటం వలన పురుషాంగానికి స్పర్శ తగ్గి, సంభోగ సమయం నిడివి పెరిగే అవకాశం ఉంది.
  • సంభోగమంటే కేవలం స్థంబించిన పురుషాంగాన్ని యోనిలోకి ప్రవేశపెట్టి స్ఖలించటం అనే అభిప్రాయం నుండి బయటపడాలి. స్పర్శ, మాట్లాడటం, వినటం, చూడటం, వాసనలు చూడటం కూడా రతిసంబంధిత అంశాలేనని గుర్తించాలి. కౌగిలింతలు, చుంబనాలు, హస్త ఘతాలు వంటి వాటిని అలవర్చుకోవాలి. ఇవన్నీ జరిగేటప్పుడు పురుషుడు తనకు ఎలా అనిపిస్తోందో తానే స్వయంగా తెలుసుకోవాలి. క్రమంగా వారిపై వారికే నియంత్రణ హస్తగతమౌతుంది.
  • యోనిలో పురుషాంగ ప్రవేశాన్ని ఆలస్యం చేయాలి. దానికి ముందు ఎక్కువ సమయం కామోద్దీపన చర్యలతోనే గడపాలి
  • ప్రత్యామ్నాయ మార్గాలైన ముఖరతి, (ఇరువురి) కామోద్దీపనకు (ఇరువురి) వ్రేళ్ళను లేదా సెక్స్ టాయ్స్ వాడటం, పరస్పర హస్తప్రయోగం, శృంగార సాహిత్యం కలిసి చదవటం, శృంగార సంభాషణలు చేయట వంటి ఇరువురికీ ఆమోదయోగ్యమైన కార్యకలాపాలు చేయటం అవలంబించాలి.

పురుషుల హక్కులుగా పురుషుల లైంగికత

పురుష లైంగికతలోని స్వేచ్ఛను కొన్ని సంఘాల ఆమోదించగా, కొన్ని సంఘాలు ఆమోదించకపోవచ్చును. అందుకే కెనడా వంటి దేశాలు లింగభేదానికి, లైంగికతకు, లైంగిక వాంఛలకు, లైంగిక ఆకర్షణలకు అతీతంగా మానవ లైంగిక హక్కులను పరిరక్షించటానికి చట్టాలను చేశాయి.

పురుష లైంగికత గురించి పురుషుల కంటే కూడా, పురుషుల హక్కుల కొరకు పోరాడే స్త్రీలే ఎక్కువగా అర్థం చేసుకొన్నారు.[4]

జస్లీన్ కౌర్ వీడియో వివాదం పై వార్తా ఛానెళ్ళు అన్నీ ముద్దాయి సరవ్ జీత్ సింగ్ కు శాపనార్థాలు పెడుతోండగా, లఘు చిత్ర రూపకర్త అయిన దీపికా భరద్వాజ్ అనే స్త్రీ మాత్రం రెండు వైపులా వినకుండా కేవలం ఒక స్త్రీ పురుషుడిపై చేసే లైంగిక వేధింపుల ఆధారంగానే అతను ఆమెను లైంగికంగా వేధించాడనే నిర్ధారణకు రావటం అసమంజసమని అవే వార్తా ఛానెళ్ళలో తెలిపారు. జస్లీన్ కౌర్ విషయంలో జరిగినది కేవలం ఒక వాదులాట మాత్రమేననీ, వాదులాటకూ, వేధింపుకూ తేడా ఉండేది మనం గమనించాలన్నారు. స్త్రీవాదులచే నిష్కర్షగా విమర్శింపబడుతోన్ననూ, పురుషుల హక్కుల కోసం పోరాడే ఈ స్త్రీలు మాత్రం వారెంచుకొన్న మార్గాన్ని వీడలేదు. వీరికి సన్నిహితులైన పురుషులు తప్పుడు వరకట్న వేధింపు వ్యాజ్యాలలో, తప్పుడు మానభంగ వ్యాజ్యాలలో స్త్రీల చేతే ఇరికించబడటం కళ్ళారా చూసిన వీరు, ఈ మార్గాన్ని ఎంచుకొన్నారు. ఈ చట్టాల దుర్వినియోగం పురుషులకే కాక, అత్త/ఆడపడుచు స్థానాలలో ఉన్న స్త్రీలకు కూడా శాపం కావటంతో ఈ మహిళలు ఈ చట్టాల దుర్వినియోగం ఆగాలని కోరుకొంటున్నారు.

రోహ్‌తక్ సోదరీమణుల వీడియో వివాదంలో సత్యాసత్యాల నిగ్గు తేల్చటానికి సైతం దీపిక స్వయంగా రోహ్‌తక్ బయలుదేరి అక్కడి ప్రత్యక్ష సాక్షులను విచారించి, ప్రసార మాధ్యమాలలో జరిగిన ప్రచారం వాస్తవాధారితం కాదని తెలుపటానికి తాను విచారించిన వారి వీడియోలు తీసి అంతర్జాలంలో పోస్టు చేసినది. తర్వాత ఈ సోదరీమణులకు పురుషులకు దేహశుద్ధి చేయటం పరిపాటి అని తేలినది. మెల్లగా ఈ ఉదంతాలలో నిజాలు బయటపడ్డాయి. తన స్వంత మాటలలో,

"Look, I totally get it that women suffer a lot in the country. There is a lot of sexism everywhere and women face a really raw deal. But what I want to show is that you can't correct that wrong by perpetuating another wrong. You can't have laws that are misused against men.
(చూడండి, ఈ దేశంలో ని సమస్యలతో స్త్రీలెలా సతమతమౌతారో నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. సర్వత్రా లైంగికత వ్యాపించి ఉండటంతో, స్త్రీలు నిజంగానే అసౌకర్యాలకు గురౌతారు. కానీ నేను చూపించదలచుకొన్నదల్లా ఏంటంటే, ఒక తప్పును సరి చేయటానికి, మనం మరొక తప్పిదాన్ని చేయలేం. పురుషులపై చట్టాలక దుర్వినియోగానికి ఒడిగట్టలేం.)"

స్త్రీవాదులు చేసే వాదనకు భిన్నంగా, లైంగిక వేధింపుల/గృహ హింస వ్యాజ్యాలను బాధితులుగా చెప్పుకొనే స్త్రీలు వారు తమ వ్యాజ్యాలను వెనక్కు తీసుకోకపోవటానికి కారణం స్త్రీల పై ద్వేషం కాదని, ఇవి ధనవ్యామోహంతో బనాయించబడ్డ కేసులని పురుషుల హక్కుల కోసం పోరాడే స్త్రీలు తెలుపుతారు. పురుషులే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతోన్న, పురుషులపైనే ఎక్కువగా హింస జరుపబడుతోన్న ప్రస్తుత తరుణంలో దృష్టి కేంద్రీకరించవలసినది స్త్రీ/స్త్రీ లైంగికత/స్త్రీ హక్కుల పైన కాదని, పురుషులు/పురుషుల లైంగికత/పురుషుల హక్కుల పైనేనని వీరు తెలిపారు. సహాయనిధులలో సైతం ఎక్కువ భాగం స్త్రీ సంక్షేమ సంస్థలకే కేటాయించబడుతోందని తెలిపారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమలు చేయబోయే మహిళలపై హింసకు అంతర్జాతీయ చట్టం (The International Violence Against Women Act) ను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా పురుషులను కూడగట్టుకొని వాషింగ్టన్, డి.సి. లోని ఆ దేశపు కాంగ్రెస్ తో చర్చించటానికి ఉమా కిరణం బయలుదేరినది. ఈ చట్టం ప్రకారం బాధితులు రక్షించబడి, నేరస్థులు శిక్షించబడతారు. పాశ్చాత్య విలువలను భారతదేశం పైన రుద్దవద్దని, పురుషబాధితులను కూడా గుర్తించాలని ఉమా అభిప్రాయపడ్డారు. లైంగికత పై సాంఘిక అవగాహన కుంటుపడి ఉన్నదని, పురుష లైంగికత సంకుచితంగా అర్థం చేసుకొనబడి ఉన్నదని, పురుష లైంగికతను నిత్యం ఎగతాళి చేయబడటం, దానికి నేరపు రంగును పులమాలని చూడటం వంటి వలన సమస్యను మరింత జటిలం చేస్తున్నాయన్నారు. వారి మాటలలో,

"We need to be sensitive towards men and their needs as well.
(పురుషులను, వారి అవసరాలను కూడా మనం గుర్తించవలసిన ఆవశ్యకత ఉన్నది.)"

"Sexual arousal is easily discernible in men, whereas it is not obvious in women. As a result, men constantly face allegations of being obsessed with sex.
(పురుషులలో లైంగిక ప్రేరేపణ స్పష్టంగా గోచరిస్తుంది, కానీ అదే ప్రేరేపణ స్త్రీలలో అంత స్పష్టంగా కనబడదు. ఫలితంగా, పురుషుల ధ్యాస ఎల్లప్పుడూ శృంగారం చుట్టూనే కేంద్రీకృతం అయి ఉంటుందనే అపప్రదను వారు నిత్యం ఎదుర్కొనవలసి వస్తోన్నది.)"

"It is also believed that men always indulge in sex voluntarily, whereas women are thought to take part in sex either to fulfil the sexual or emotional needs of men or because they are forced to do so by men against their will.
(శృంగారంలో ఐచ్చికంగా పాల్గొనేది ఎప్పుడూ పురుషులేనని, స్త్రీలు కేవలం పురుషుల లైంగిక/భోవోద్వేగ అవసరాలను తీర్చటానికి లేదా కేవలం వారి ఇష్టానికి వ్యతిరేకంగా పురుషులచే బలవంతం చేయబడతారనే తప్పుడు అభిప్రాయం కూడా కలదు.)"

"Today, male sexuality is ridiculed, insulted, misunderstood, undermined, disregarded, criminalised and everything but respected.
(ఈ రోజున పురుష లైంగికత గేలి చేయబడుతోన్నది, అవమానింపబడుతోన్నది, అపార్థం చేసుకొనబడుతోన్నది, అణగద్రొక్కబడుతోన్నది, నిరాకరించబడుతోన్నది, నేరపూరితం చేయబడుతోన్నది; గౌరవించటం తప్పితే మిగతావన్నీ చేయబడుతోన్నది.)"

అవగాహన

లైంగికానందం పొందే మునుపే గర్భం గురించి, అత్యవసర గర్భనిరోధక పద్ధతుల గురించి, లైంగికంగా సంక్రమించే వ్యాధుల గురించి పురుషుడు తెలుసుకొనవలసిన అవసరం ఉంది.

నష్టనివారణ చర్యలు

  • అసలు సంభోగమే జరుపకుండా ఉండటం
  • యోనిలో పురుషాంగం ప్రవేశపెట్టకనే లైంగిక చర్యలను ఆనందించటం
  • కండోమ్ లను వాడటం
  • వేసెక్టమీ చేయించుకొని సంభోగంలో పాల్గొనటం

సుఖ వ్యాధుల లక్షణాలు

  • పురుషాంగం (అవాంఛిత) ద్రవాలు స్రవించటం
  • మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించటం
  • మూత్రవిసర్జనలో రక్తం పడటం
  • మూత్రవిసర్జన చేయాలనిపించటం కానీ చేయలేకపోవటం
  • పురుషాంగం, వృషణాలు లేదా/, మలద్వారం చుట్టూ పొక్కులు, గుల్లలు, పుండ్లు అవ్వటం
  • పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం

ఆధునిక పోకడల ప్రభావం

బ్రెజిల్కు చెందిన కార్లోస్ లటూఫ్ అనే వ్యంగ్య చిత్రకారుడు గీసిన వ్యంగ్య చిత్రం ఈవిల్ డిక్ (రాక్షస పురుషాంగం)

ఇటీవలి కాలంలో దూసుకుపోతున్న ఆధునిక స్త్రీవాదం, సంఘంలో పెరుగుతోన్న ఆమోదాల వలన పాశ్చాత్య దేశాలలో స్త్రీ లైంగికతకు విమోచన లభించిననూ అన్నింటా ముందుండే ఈ దేశాలలో సైతం పురుష లైంగికత సమస్యాత్మకంగానే పరిగణింపబడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అక్కడి యువతుల లైంగికతకు/లైంగికానందాన్ని అనుభవించుటకు/లైంగిక భావాలను వ్యక్తపరచుటకు ఎటువంటి పరిమితులు ఉండవలసిన అవసరం లేదని నమ్మకం కలిగించబడ్డది. యుగయుగాలుగా స్త్రీల వివాహేతరసంబంధాలపై విధించబడ్డ నిషేధాజ్ఞలు సడలించబడినవి.

అపార్థాలు

పురుషులకు కావలసిందల్లా ఒక్కటే అనే సున్నిత, పరిహాస పదజాలం నుండి అతిపెద్ద అపవాదుల వరకు పురుష లైంగికత అపార్థం చేసుకొనబడుతోన్నది. పురుషుల ఓరచూపు భయకంపితులని చేస్తోంది. వారి వాంఛలు వారి దుందుడుకు స్వభావాన్ని సూచిస్తోంది. లైంగిక నేరాలను తగ్గించే సరియైన, అవసరమైన ప్రయత్నాలతో పురుష లైంగికత ప్రమాదకరమైనది, భయోత్పాతము సృష్టించేది అనే అవాంఛిత అభిప్రాయాన్ని నాటుకుపోయేటట్లు చేసినవి. మగజాతి, మృగజాతి ఒక్కటేనన్న నానుడిని తీసుకువచ్చింది.

పురుష లైంగికత అనగానే స్ఫురించేది కాఠిన్యమే. పురుషులు సైతం వారికి కావలసినదేమిటో తెలుసుకోకుండా, తమని తాము అర్థం చేసుకోకుండా కాఠిన్యమంటే ఏమిటో (తద్వారా పురుష లైంగికత అంటే ఏమిటో) తెలిపే మూలాల కోసం వెదుకుతూ ఉంటారు.

విశ్లేషణ

స్త్రీ జాతికి సమస్యలున్నవి. వారి సమస్యలన్నీ పురుషజాతి వలనే. అని పదే పదే వెలువడే దురభిప్రాయంతోనే ఈనాటి ఈ దుర్భర పరిస్థితి దాపురించింది. అశ్లీలత బాలుర లైంగిక అభివృద్ధికి, వారి స్వాభిమానానికి, సంఘంలో వారి ప్రతిబింబానికి, చేటు తెచ్చింది. వారిలో మానసిక ఆందోళనలను పెంచింది. ఈ మానసిక రుగ్మతల వలన కేవలం లైంగికత/లైంగిక సంబంధాల కారణం చేత ఆత్మాహుతికి పాల్పడే యువకుల సంఖ్య అవే కారణాల చేత ఆత్మాహుతికి పాల్పడే యువతుల కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.

వివక్ష

Be civil don't be a dick (పురుషాంగంగా కాదు నాగరికంగా ఉండు) అని సందేశాన్నిచ్చే లోగో

పాశ్చాత్య దేశాలలో వయసుపైబడి యువకుల సాంగత్యం కోరే స్త్రీలు సున్నితమైన Cougar (ఒక రకమైన మార్జాలము) లేదా కఠినమైన MILF (మదర్ ఐ లైక్ టు ఫక్) వంటి మారుపేర్లతో గౌరవప్రదంగా సంబోధించబడుతున్నారు. అవే వాంఛలు గల పురుషులు మాత్రం విటులుగా, అప్రాచ్యపు ముసలి వారుగా సంబోధించబడుతున్నారు.

మిథ్యలు-వాస్తవాలు

  • పురుషులు ఎప్పుడూ సంభోగం కోసం అర్రులు చాస్తూ ఉంటారు.
    • పురుషులు సంభోగపు యంత్రాలు కారు. వారి మదిలో మెదిలే భావనలు సంభోగానికి సంబంధించినవి కావు. సంభోగం ఇష్టమైన వారికి కూడా సంభోగం గురించి కాక మిగతా చాలా వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సంభోగం వారికి ఎంత ముఖ్యం/సంతృప్తో, ఈ ఇతర విషయాలు కూడా వారికి అంతే ముఖ్యం/సంతృప్తికరం. స్త్రీలలో సంభోగం పట్ల ఎంతటి అనాసక్తత నెలకొని ఉందో, పురుషులలో కూడా అంతే అనాసక్తత నెలకొని ఉంది. రోజువారి జీవితంలో తారసపడే సంక్లిష్టతలు, బాధ్యతలు దీనికి ప్రధాన కారణాలు. ఒక్కోమారు సంభోగాన్ని పురుషులు భారంగా పరిగణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
  • పురుషాంగం ఎంత పెద్దది అయితే, సంభోగం అంత సౌఖ్యం.
    • పురుషుని సౌఖ్యానికి, అతని లైంగిక భాగస్వామి యొక్క సౌఖ్యానికి, పురుషాంగ పరిమాణానికి/ఆకృతికి సంబంధం లేదు. యోనిలో పై మూడోవంతులో మాత్రమే నరములు అధికసంఖ్యలో ఉంటాయి కాబట్టి, స్త్రీకి దానికంటే లోతులో ఎటువంటి స్పర్శాజ్ఞానము ఉండదు. అయితే, స్త్రీకి లైంగికానందాన్ని ఇచ్చే ప్రధాన భాగం యోనిశీర్షం. యోని ఒక ప్లాస్టిక్ ట్యూబు వలె, ఎల్లప్పుడూ తెరుచుకొని ఉండదు. కావున దానిని మొత్తం పూరించవలసిన అవసరము లేదు. సాధారణ స్థితిలో ఎలాస్టిక్ సంచి వలె యోని యొక్క గోడలు ఒకదానినొకటి తాకే ఉంటాయి. వాటి మధ్య ఏదైనా వస్తువు కదిలితే తప్ప గోడలు ప్రక్కలకు తప్పుకోవు. ఎటొచ్చీ మలద్వారం ఎలాస్టిక్ గా ఉండదు కావున గుద మైథునంలో మాత్రం పురుషాంగం చిన్నదిగా ఉంటేనే మంచిది.
  • పురుషులెవరూ శీలం కలవారు కారు.
    • పురుషులు గొప్పలు చెప్పుకోవటానికి, సంఘంలో వారి పుంసత్వం గుర్తింపు పొందటానికి వారికి సంభోగంలో అనుభవం ఉన్నదని చెప్పుకొంటుంటారు. పాశ్చాత్య దేశాలలో సైతం 24-26% పురుషులు శీలం కోల్పోని వారే నని సర్వేలలో తేలినది.
  • అంగస్థంబన కలిగితేనే సంభోగం సాధ్యం.
    • చేతులు, నోరు, ఊహలు, ఇంకనూ చాలా విషయాలు, వస్తువులతో సంభోగం, తృప్తిని పొందటం, తృప్తి పరచటం సాధ్యం. శరీరమంతా కప్పబడి ఉన్న చర్మం, అతి పెద్ద జనాంగం, మెదడు అతి శక్తిమంతం.
  • పురుషుడు స్ఖలించగనే సంభోగం పూర్తి అయినట్లు లెక్క.
    • కావలసిన సమయం కంటే ముందే పురుషుడు స్ఖలనానికి సిద్ధమైతే, నిదానించటమో, కాసేపు సంభోగము ఆపివేయటమే చేసి, మరల పున:ప్రారంభించవచ్చును. భాగస్వాములిరువురు భావప్రకటన చేసుకొంటూ సిద్ధంగా ఉన్నపుడు స్ఖలించవచ్చును. అయితే ప్రతి సంభోగములో స్ఖలనము, భావప్రాప్తి తుదిమెట్టు కాదు. ఈ రెండు లేకుండా కూడా సంభోగము పూర్తి చేయటం సాధ్యమే
  • భావప్రాప్తిలో ఎనలేని సౌఖ్యమున్నది.
    • తత్వంలో తీవ్రతలో భావప్రాప్తి ఒక్కొక్క మారు ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలా మటుకు సౌఖ్యాన్ని ఇచ్చేవే అయినా, ఒక్కోమారు అనుకొన్నంత సౌఖ్యాన్ని భావప్రాప్తి ఇవ్వలేకపోవచ్చును.
  • శారీరక సంబంధంలో ఉన్న పురుషులు హస్తప్రయోగం చేయరు.
    • శారీరక సంబంధంలో ఉన్న వారు (స్త్రీ-పురుషులు) లేని వారితో పోలిస్తే హస్తప్రయోగం తక్కువగా చేసినా, భాగస్వామి అందుబాటులో లేనపుడో, వారి స్వంత సౌఖ్యానికో అందరూ హస్తప్రయోగం చేస్తారు. కొందరు దంపతులు మానసికంగా మరింత దగ్గర అవ్వటానికి కూడా హస్తప్రయోగాన్ని ఆశ్రయిస్తారు. హస్తప్రయోగం చేయటం భాగస్వామిని మోసగించినట్లు కాదు, వ్యక్తిగత ప్రాధాన్యత.
  • నిద్రలో అంగస్థంబన జరగటం, స్వప్నస్ఖలనం అవ్వటం మంచిది కాదు.
    • ఇవి సర్వసాధారణం. ప్రతి పురుషుడిలో ఇవి జరగటం ఉంది. పైగా ఇలా జరగటం లైంగిక ఆరోగ్యానికి సూచనలు.
  • పడకగదిలో పురుషులు స్వార్థపరులు. వారు భాగస్వామి సంతృప్తి కంటే వారి సంతృప్తికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.
    • ఇది పూర్తిగా వాస్తవదూరం. మానసిక బంధం కలిగిన భాగస్వామి ఉంటే పురుషుడు తన సంతృప్తికి ఎంతటి ప్రాముఖ్యతనిస్తాడో, భాగస్వామి సంతృప్తికి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తాడు. పురుషుడు సంభోగ సమయంలో భాగస్వామి కళ్ళలో ఆనందం చూడాలనుకొంటాడు. తాను తన భాగస్వామికి ఆనందాన్నివ్వగలిగేలా చేసినందుకు తమ డాక్టరుకు కృతజ్ఞతలు తెలిపే పురుషులే ఇందుకు ఉదాహరణలు. అంగస్థంబన తీవ్రత ఎక్కువగా ఉంటేనే, భాగస్వామిలో సంతృప్తి కూడా ఎక్కువగా ఉంటుంది అనే అపోహతో, దాని తీవ్రతను పెంచాలని కోరుతూ డాక్టరు వద్దకు వచ్చే పురుషులు కూడా దీనికి చక్కని ఉదాహరణలు.[5]
  • పురుషులకు వీర్యస్ఖలనం, భావప్రాప్తి ఒక్కటే.
    • ఇది పాక్షికంగా నిజం, పాక్షికంగా అబద్ధం. చాలా మంది పురుషులకు ఈ రెండు వేర్వేరు ప్రక్రియలు అని తెలియవు. తాము హస్తప్రయోగం చేసుకొనేది ఎవరైనా చూస్తారేమో, తొందరగా ముగించేయాలి అనే ఆదుర్దాలోనే బాలుడు పురుషుడౌతాడు. కావున పురుషుడికి ఈ రెండూ వేర్వేరు అని గుర్తించటానికి అవకాశం బహు అరుదుగా దొరుకుతుంది. పైగా చదివిన శృంగార పూరిత సాహిత్యం, చూచిన నిశ్చలన/చలన చిత్రాలు, ఈ రెండూ ఒక్కటే నన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. తనకు తెలియకనే ఈ ఒకదానితో మరొకదానికి పురుషుడు అవినాభావసంబంధం ఏర్పరచుకొంటాడు. ఒకటి జరిగినపుడే మరొకటి కచ్చితంగా జరుగుతుందనే అపోహలో ఉండటం వలన పురుషుడికి ఇదంతా ఒక్కటే అని అనిపిస్తుంది. వాస్తవానికి స్ఖలనం లేకుండా కూడా పురుషుడు భావప్రాప్తి పొందగలడు. ఒకే సంభోగ చర్యలో పలుమార్లు భావప్రాప్తులను పొందే పురుషులు కూడా ఉన్నారు. అయితే భావప్రాప్తి పొందిన ప్రతి సారీ పురుషులు అంతో ఇంతో స్ఖలించవచ్చును, స్ఖలించకపోనూవచ్చును.
  • పురుషుల లైంగిక సామర్థ్యం స్త్రీలకు ఉన్నంత ఎక్కువగా ఉండవు.
    • స్త్రీ పురుషులిరువురిలో లైంగిక సామర్థ్యం సమానమే. స్త్రీలలోనే ఒకరికున్నంత హెచ్చైన లైంగిక సామర్థ్యం మరొకరికి ఉండవు. ఈ అంశంలో పురుషజాతి కూడా ఏమాత్రం మినహాయింపు కాదు. ఐదు వ్రేళ్ళూ వేర్వేరుగా ఎలా ఉన్నాయో మనిషి మనిషికీ లైంగిక సామర్థ్యాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. భాగస్వామి లైంగికతను, లైంగిక వాంఛల తీవ్రతను, లైంగిక సామర్థ్యాన్ని తెలుసుకోగలిగే, గౌరవించగలిగే బాధ్యత ఒక్కరికే పరిమితం కాదు, ఇరువురికీ వర్తిస్తుంది.

ముగింపు

పురుష లైంగికతలో సానుకూల అంశాలను స్వాగతించినట్లయితే పురుషులు సంతుష్టులై వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని చక్కని లైంగిక భాగస్వాములుగా, మంచి ప్రేమికులుగా ఇంకా చెప్పాలంటే సహృదయులుగా ఎదగగలరు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. పరిపరివిధాలుగా తోడ్పడినా పురుష లైంగికత సానుకూల దృక్పథంలో పరిగణించబడుట లేదు (ద గార్డియన్ - 18 జూలై 2011)
  2. "సెక్సువాలిటీ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్". Archived from the original on 2015-09-04. Retrieved 2015-11-10.
  3. "స్త్రీల కంటే పురుషులలోనే లైంగిక ఆసక్తి ఎక్కువ (నెట్ డాక్టర్ - 24 సెప్టెంబరు 2014)". Archived from the original on 2015-12-05. Retrieved 2015-11-15.
  4. పురుషుల హక్కుల కోసం కదం తొక్కిన స్రీ జాతి హఫింగ్ పోస్ట్ - 26 సెప్టెంబరు 2019)
  5. "పడకగదిలో పురుషులు స్వార్థపరులు కారు (వుమెన్స్ హెల్త్ - 21 ఏప్రిల్ 2014)". Archived from the original on 2015-10-29. Retrieved 2015-11-11.