ప్రాణ్
స్వరూపం
ప్రాణ్ | |
---|---|
జననం | ప్రాణ్ క్రిషన్ సికంద్ 1920 ఫిబ్రవరి 12 కొత్త ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా |
మరణం | 2013 జూలై 12 ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 93)
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1940–2007 |
జీవిత భాగస్వామి | శుక్లా సికంద్ |
పిల్లలు | 3 |
ప్రాణ్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. తనదైన విలక్షణ శైలితో దాదాపు 400 చిత్రాలలో నటించాడు. దాదాపు ఆరు శతాబ్దాలపాటు ఇతని నట జీవితం సాగింది. కొన్ని తెలుగు చిత్రాలలో కూడా ప్రతినాయక పాత్రలను పోషించాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ప్రాణ్ ఫిబ్రవరి 12, 1920న పాతఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ క్రిషన్ సికంద్ సివిల్ ఇంజనీరుగా ప్రభుత్వ కాంట్రాక్టరుగా పని చేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు.
ప్రాణ్ చిన్నతనంలో చదువులో ముఖ్యంగా గణితంలో మంచి ప్రతిభ కనబరిచాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావడంతో ఆయన డెహ్రాడూన్, కపుర్తలా, మీరట్ లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరగా మెట్రిక్యులేషన్ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో పూర్తిచేశాడు.
పురస్కారములు, గౌరవాలు
[మార్చు]భారత ప్రభుత్వ పురస్కారములు
[మార్చు]జాతీయ చలనచిత్ర పురస్కారములు
[మార్చు]- 2012 – దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం [2]
ఫిలింఫేర్ పురస్కారములు
[మార్చు]- 1967 – ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు, ఉప్కార్[3] చిత్రం కోసం
- 1969 – ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు, ఆంసూ బన్‌గయే ఫూల్ చిత్రం కోసం
- 1972 – ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు , బేఇమాన్ చిత్రం కోసం
- 1997 – ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారము
మూలాలు
[మార్చు]- ↑ Lata, Bismillah Khan get Bharat Ratnas రీడిఫ్.కాం, 25 జనవరి 2001. "The Padma Bhushan...veteran actor Pran,".
- ↑ "Actor Pran to receive this year's Dadasaheb Phalke Award". Times of India. Archived from the original on 2013-06-15. Retrieved 2013-04-12.
- ↑ "PRAN – Awards". Archived from the original on 2013-06-24. Retrieved 2013-04-12.
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో ప్రాణ్‌కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
వర్గాలు:
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- Commons category link is defined as the pagename
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1920 జననాలు
- 2013 మరణాలు
- హిందీ సినిమా నటులు
- హిందీ సినిమా ప్రతినాయకులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు