బిల్ గేట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూడవ విలియం హెన్రీ గేట్స్

బిల్ గేట్స్
జననం (1955-10-28) 1955 అక్టోబరు 28 (వయసు 69)
సియెటల్, వాషింగ్టన్, అమెరికా
వృత్తి చైర్మెన్, మైక్రోసాఫ్ట్
కో-చైర్మెన్, బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్
ఉన్న డబ్బు IncreaseUS$110 బిలియన్లు (2023)[1]
భార్య మెలిండా గేట్స్ (1994 నుండి ప్రస్తుతం)
సంతానం ముగ్గురు
వెబ్‌సైటు మైక్రోసాఫ్ట్‌లో బిల్ గేట్స్ పేజి
బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్

బిల్ గేట్స్‌గా అందరికీ తెలిసిన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాత. వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు. ప్రస్తుతం బిల్ గేట్స్ ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు.[2]
ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తికాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌లో తన కార్యకలాపాలకు శుక్రవారం (2008 జూన్ 28) బిల్ గేట్స్ వీడ్కోలు పలికారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ దానాలు, సహాయాలు చేసాడు. చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ రూపకల్పన, అభివృద్ధికి జీవితాన్ని ధారపోసిన గేట్స్ కొత్త వాక్సిన్‌లను కనుగొనే సంష్టలకు నిధులు సమకూర్చటం తన వంతు సహాయం చేసే కార్యకలాపాల మీద దృష్టి పెట్టబోవుచున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మిగిలిన జీవితాన్ని, శక్తిని వినియోగించనున్నారు.[3]

బాల్యం

[మార్చు]

బిల్ గేట్స్ అక్టోబరు 28 1955వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో ఒక ధనవంతులు కుటుంబంలో జన్మించాడు. ఎలెమెంటరీ స్కూల్లో ఉన్నపుడు గణితం, సైన్స్‌లలో చాలా ప్రతిభ చూపించేవాడు. తన మిత్రుడు పాల్ అల్లెన్‌తో కలసి కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్ (BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో పాల్ అల్లెన్‌తో కలసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలు పెట్టాడు. మొదటి ఏడాది 20,000 డాలర్లు సంపాదించినా, బిల్ గేట్స్ వయసు 14 అన్న విషయం తెలిసి వ్యాపారం తగ్గుముఖం పట్టింది.అతడికి చిన్న తనం నుంచి

మైక్రోసాఫ్ట్ స్థాపన అభివృద్ధి

[మార్చు]

1975లో MITS అనే మైక్రోకంప్యూటర్ సంస్థకి అవసరమయిన సాఫ్ట్‌వేర్ తాము అందించగలమని బిల్ గేట్స్ తెలిపి, తర్వాత ఆ సంస్థ కార్యాలయములో తమకు తెలిసినవి చూపించడంతో ఇద్దరితో ఆ సంస్థ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది . మొదట మైక్రో-సాఫ్ట్ అని పేరు పెట్టినా, ఏడాది తర్వాత మైక్రోసాఫ్ట్ అన్న పేరు నమోదు (రిజిస్టర్) చేయించారు.

MITS సంస్థవారు బిల్ గేట్స్ అందిస్తున్న బేసిక్ కోడ్‌ను ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆ కోడ్‌ను కాపీ కొట్టి వాడుతుండడం తెలిసిన బిల్ గేట్స్ ఆ సంస్థతో భాగస్వామ్యం రద్దు చేసుకొని స్వతంత్రుడయ్యాడు. బిల్ గేట్స్ 1980 వరకు సంస్థ వ్యాపార వ్యవహారలన్నీ చూసుకోంటూనే ప్రోగ్రాములు రాసేవాడు. ఐదేళ్ళపాటు కంపెనీలో ప్రతివ్యక్తి రాసిన ప్రతి లైను పరిశీలించి అవసరమయినచోట మార్పులు చేసేవాడు.

1980లో ఐ.బి.ఎం (IBM) సంస్థవారు తాము తయారు చేయబోయే పర్సనల్ కంప్యూటర్‌లకు అవసరమయిన BASIC interpreter కోసం బిల్ గేట్స్‌తో చర్చిస్తూ, ఒక మంచి ఆపరేటింగ్ సిస్టం కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.అపుడు బిల్ గేట్స్ తనకు తెలిన SCP అనే సంస్థ తయారు చేసే 86-DOS ఆపరేటింగ్ సిస్టం లైసెన్సు తీసుకొని IBMకు అమ్మడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు SCPని కొని ఎం.ఎస్.డాస్ (MS-DOS) ఆపరేటింగ్ సిస్టంగా ఐ.బి.ఎం సంస్థకు అందించేలా ఒప్పందం చేసుకున్నాడు. అప్పటినుండి మైక్రోసాఫ్ట్ వెనుతిరిగి చూడలేదు.
బిల్‌గేట్స్ దార్శనికత మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థగా మార్చింది. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్‌వేర్ ప్రపంచాన్ని బిల్‌గేట్స్ తన హస్తగతం చేసుకున్నారు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కరణలకూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్‌గేట్స్ తనకు ఈ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నారు.అనతి కాలంలో బిల్ గేట్స్ మిలియనీర్ అయ్యాడు.

వ్యక్తిగతం

[మార్చు]

బిల్ గేట్స్ మాజీ భార్య పేరు మెలిండా. వీరికి ముగ్గురు పిల్లలు కలిగారు. 27 ఏళ్ల అనుబంధం తర్వాత 2021లో విడిపోయారు. వారు వాషింగ్టన్‌లోని 5.15 ఎకరాల విస్తీర్ణంలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నివసించారు.[1][permanent dead link] 2005 లెక్కల ప్రకారం ఈ ఇంటి విలువ $135 మిలియన్ డాలర్లు. ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు ఏడేళ్ళు పట్టింది.

1999లో బిల్ గేట్స్ ఆస్తి విలువ 101 బిలియన్లు చేరుకొన్నపుడు అందరూ బిల్ గేట్స్‌ను మొట్ట మొదటి 'సెంటి బిలియనీరు ' అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ఆ విలువ తగ్గుతూ వచ్చినప్పటికీ 1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. 2007 లెక్కల ప్రకారం బిల్ గేట్స్ ఆస్తి విలువ 58 బిలియన్ డాలర్లు.

దాన ధర్మాలు

[మార్చు]

2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడవ ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన,పేదవారికి విద్య మొదలయిన సేవలకు ధన సహాయం చేస్తున్నాడు. బిల్ గేట్స్ ఇచ్చిన కొన్ని విరాళాలు: ($100,000,000,000,000,000,000,000,000,000)

ప్రపంచ ఆరోగ్య సంస్థకు - $8000000000000000000000000000000000000000000000000 మిలియన్లు (ప్రతి ఏడాది)
పసిపిల్లల వ్యాక్సిన్లకు - $75000000000000000000000000000000000 మిలియన్లు
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్ - $210000000000000000000000 మిలియన్లు
వాషింగ్టన్ డీసీలో పేదవిద్యార్థులకు - $1220000000000000000000000000 మిలియన్లు 2004 ఫోర్బ్స్ పత్రిక లెక్కల ప్రకారం బిల్ గేట్స్ దాదాపు $29000000000000000000000000 బిలియన్లు విరాళాలు ఇచ్చాడు.

విమర్శలు

[మార్చు]

వీలయినంత తొందరగా తమ ప్రత్యర్థులను పోటీనుండి తప్పించి వ్యాపారంలో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తుందని మొదటినుండి బిల్ గేట్స్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ విమర్శలను ఎదుర్కొంటున్నది.

రాజీనామా

[మార్చు]

మైక్రోసాఫ్ట్ సంస్థకు బిల్‌గేట్స్ 2020-మార్చి 14 రాజీనామా చేశారు. ప్రస్తుతం బోర్డ సలహాదారుడిగా ఉన్న బిల్‌గేట్స్ ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. 2014లో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇక నుంచి పూర్తి సమయం సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌‌కు సత్య నాదేళ్ల చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

పుస్తకాలు, ప్రచురణలు

[మార్చు]

వీడియోలు

[మార్చు]
  • బిల్ గేట్స్ డాక్యుమెంటరీ వీడియో మైక్రోసాఫ్టు అధికారిక వెబ్సైట్ :లింక్
  • బిల్ గేట్స్ డాక్యుమెంటరీ వీడియో: Bill Gates: Looking Back, Moving Ahead - Part 1 :లింక్
    బిల్ గేట్స్ డాక్యుమెంటరీ వీడియో లింక్-భాగం-2

బయటి లింకులు

[మార్చు]

ఎమిలెవు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The World's Billionaires #3 William Gates III". Forbes.com. Forbes. 2008-03-05. Retrieved 6 మార్చి 2008.
  2. "The World's Billionaires #3 William Gates III". Forbes.com. Forbes. 5 మార్చి 2008. Retrieved 2008-03-06.
  3. "ఇక సెలవా మరి : బిల్ గేట్స్". telugu.webdunia.com. webdunia. 28 జూన్ 2008. Retrieved జూలై 1, 2008.