శొంఠి భద్రాద్రి రామశాస్త్రి
Jump to navigation
Jump to search
శొంఠి భద్రాద్రి రామశాస్త్రి | |
---|---|
జననం | 1856 |
మరణం | 1915 |
వృత్తి | కవి |
తల్లిదండ్రులు |
|
శొంఠి భద్రాద్రి రామశాస్త్రి (1856-1915) తెలుగు కవి.
వీరి జన్మస్థానము: పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. వీరు వెలనాటి వైదికులు, గౌతమ గోత్రీయులు. వీరి తండ్రి: గంగరామయ్య. తల్లి: కామాంబ. రామచంద్రోపాఖ్యానం అనే ప్రబంధాన్ని రచించిన వారణాసి వేంకటేశ్వరకవి ఇతనికి మాతామహుడు. వంశీయులెల్లరు వేదవిదులు.
రచించిన గ్రంథాలు
[మార్చు]- కాళిందీ పరిణయము,
- శంతనూపాఖ్యానము (ఆంధ్రప్రబంధములు).
- చిత్రసీమ (కళాపూర్ణోదయమువంటి కల్పితకథా కావ్యము).
- శంబరాసుర విజయము (సంస్కృత చంపువు).
- శివరామశతకము (ద్వ్యర్థి.)
- ముక్తావళి (మదాలసకథగల సంస్కృతాంధ్ర నాటకములు-)
- మల్లిక (నవల)
- అహోబల పండితీయ వ్యాఖ్య-
- లఘుకౌముది (ఆంధ్ర టీక)
- జగన్నాథక్షేత్ర మహాత్మ్యము,
- శ్రావణమహోత్సవ తారావళి - ఇత్యాదులు.
మూలాలు
[మార్చు]- శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950. పేజీలు: 154-7.