షెర్ని
షెర్ని | |
---|---|
దర్శకత్వం | అమిత్ వి. మసుర్కర్ |
స్క్రీన్ ప్లే | ఆస్థ టికు |
కథ | ఆస్థ టికు |
నిర్మాత | భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ విక్రమ్ మల్హోత్రా అమిత్ వి. మసుర్కర్ |
తారాగణం | విద్యాబాలన్ |
ఛాయాగ్రహణం | రాకేష్ హరిదాస్ |
కూర్పు | దీపికా కర్లా |
సంగీతం | బెనెడిక్ట్ టేలర్ |
నిర్మాణ సంస్థలు | టీ-సిరీస్ అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 18 జూన్ 2021 |
సినిమా నిడివి | 130 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
షెర్ని 2021లో హిందీలో విడుదలైన థ్రిల్లర్ సినిమా. టి-సిరీస్, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ వి. మసుర్కర్ నిర్మించిన ఈ సినిమాకు అమిత్ వి. మసుర్కర్ దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 2న విడుదల చేసి[1], జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]మధ్యప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతానికి విద్యా విన్సెంట్(విద్యా బాలన్) డీఎఫ్‌ఓ(డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్)గా వెళ్తుంది. అదే అడవిలో రెండు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తిస్తారు. వాటిలో టీ12 అనే ఓ పులి మనుషులపై దాడి చేసి చంపేస్తుంటుంది. విద్య తన సిబ్బందితో కలిసి ఆ పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటంతో పులి దాడిని ఎమ్మెల్యే (అమర్ సింగ్ పరిహార్), మాజీ శాసనసభ్యుడు (సత్యకం ఆనంద్) రాజకీయ లబ్ధి కోసం వాడుకొంటారు. మరి చివరకు పులిని విద్య పట్టుకుందా ? రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి పని చేశారు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
[మార్చు]- విద్యాబాలన్ - విద్యా విన్సెంట్ IFS[5]
- శరత్ సక్సేనా - రంజన్ రాజాన్స్ అకా పింటూ
- విజయ్ రాజ్ - హసన్ నూరానీ
- ఇలా అరుణ్ - పవన్ తల్లి
- బ్రిజేంద్ర కాలా - బన్సాల్
- నీరజ్ కబీ - నాంగియా
- ముకుల్ చద్దా - పవన్
- అమర్ సింగ్ పరిహార్ - ఎమ్మెల్యే జికె సింగ్
- సత్యకం ఆనంద్ - పీకే సింగ్
- అనూప్ త్రివేది - ప్యారే లాల్
- గోపాల్ దత్ - సాయిప్రసాద్
- సుమ ముకుందన్ - విద్య తల్లి
- నడిమ్ హుస్సేన్ - ఫారెస్ట్ గార్డ్/షూటర్
- నిధి దివాన్ - రేష్మ
- సంప మండలం - జ్యోతి
- లోకేష్ మిట్టల్ - డీఎఫ్‌ఓ మోహన్
అవార్డులు & ప్రశంసలు
[మార్చు]అవార్డు | వేడుక తేదీ | వర్గం | గ్రహీతలు | ఫలితం | Ref. |
---|---|---|---|---|---|
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ | 20 ఆగస్టు 2021 | ఉత్తమ నటి | విద్యా బాలన్ | గెలిచింది | [6] |
FOI ఆన్‌లైన్ అవార్డులు | 23 జనవరి 2022 | ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | షెర్ని | నామినేట్ చేయబడింది | [7] |
ఉత్తమ నటి - ప్రధాన పాత్ర | విద్యా బాలన్ | నామినేట్ చేయబడింది | |||
బెస్ట్ డైలాగ్స్ | యశస్వి మిశ్రా & అమిత్ వి. మసుర్కర్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ ప్రదర్శన - సమిష్టి తారాగణం | షెర్నీ తారాగణం | నామినేట్ చేయబడింది | |||
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ | దీపికా కల్రా | గెలిచింది | |||
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | దేవికా దవే | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ సౌండ్ డిజైన్ & మిక్సింగ్ | అనిష్ జాన్, బిబిన్ దేవ్ & రమేష్ బిరాజ్దర్ | నామినేట్ చేయబడింది | |||
67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | 30 ఆగస్టు 2022 | ఉత్తమ నటి | విద్యా బాలన్ | నామినేట్ చేయబడింది | |
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) | అమిత్ వి. మసుర్కర్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ నటి (క్రిటిక్స్) | విద్యా బాలన్ | గెలిచింది | |||
ఉత్తమ స్క్రీన్ ప్లే | ఆస్తా టికూ | నామినేట్ చేయబడింది | |||
బెస్ట్ డైలాగ్ | అమిత్ మసుర్కర్ & యశస్వి మిశ్రా | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ సినిమాటోగ్రఫీ | రాకేష్ హరిదాస్ | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | దేవికా దవే | నామినేట్ చేయబడింది | |||
ఉత్తమ సౌండ్ డిజైన్ | అనిష్ జాన్ | నామినేట్ చేయబడింది | |||
బెస్ట్ ఎడిటింగ్ | దీపికా కల్రా | నామినేట్ చేయబడింది |
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (2 June 2021). "ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
- ↑ Eenadu (17 May 2021). "నేరుగా ఓటీటీలోకి 'షేర్నీ'". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
- ↑ NTV Telugu (20 June 2021). "రివ్యూ: షేర్నీ (హిందీ సినిమా)". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
- ↑ Sakshi (18 June 2021). "'షేర్నీ' మూవీ రివ్యూ". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
- ↑ Sakshi (18 May 2021). "OTTలో విద్యాబాలన్ మూవీ: అప్పటి నుంచే ప్రసారం". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
- ↑ "Indian Film Festival of Melbourne 2021: Vidya Balan, Suriya Win Top Honours". The Quint. 20 August 2021. Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ "7th FOI Online Awards, 2022". 15 January 2022. Archived from the original on 16 January 2022. Retrieved 17 January 2022.