conduct
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, నడిపించుకొని పోవుట, దారి చూపుట, పిల్చుకొని పోవుట, తీసుకొని పువుట, నడిపించుట, జరిగించుట.
- he conducts the school very well ఆ పల్లె కూటమును చక్కగా జరిగిస్తాడు.
- he conducted himself very well నిండా చక్కగా నడుచుకొన్నాడు.
- he conducted himself very ill నిండా దుర్మార్గముగా నడిచినాడు.
- he approved their వాండ్లు చేసినదాన్ని ఒప్పుకొన్నాడు.
- good conduct మంచి నడక, సన్మార్గము.
- bad conduct దుర్మార్గము, చెడ్డ నడక.
- manly conduct మానుష్యము, పెద్ద మని షితనము.
- or management చేయడము, నిర్వాహకత.
- the conduct of the affairs was entrusted to him ఆ కార్య నిర్వాఃకమును వాడి మీద వుంచినారు.
- a safe conduct or passport రాదారి.
- a safe conduct or guard సంరక్షణగా తీసుకొని పోయ్యే పారా, అంపుదోడు, దారిబడి, సహవాసము.
- they gave ten sepoys as a safe conduct for the money ఆ రూకలను తీసుకొని పోయి వొప్పగించమని పది సిపాయీలను యిచ్చినారు.
- he went with her as a safe conduct or guard వాడు దానితోడుగా పోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).