Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

double

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, రెట్టింపు, రెండింతలు, యిబ్బడి.

  • ( a facsimile) రెండోది, రెండోమారు.
  • he is the double of his brother వాడి అన్నయెంతటివాడో వాడున్ను అంతటివాడే.
  • or fold మడత.
  • he made a double in the paper ఆ కాకితమును మడిచినాడు.
  • ( in hunting ) the rat made a doubleయెలుక పారిపోతూ వుండగా అట్టెమళ్లుకొని పరుగెత్తునది.

క్రియ, నామవాచకం, ద్విగుణమౌట, రెట్టింపౌట, రెండింతలౌట,the noise doubled ధ్వని రెండింతలైనది.

  • the rat doubled to elude the cat పిల్లిని తప్పించుకోవడమునకై ఆ యెలుక లటుక్కున మళ్లుకొనిపరుగెత్తినది.

క్రియ, విశేషణం, రెట్టించుట, రెట్టింపుగాచేయుట, మడుచుట.

  • he double d the guard అపారాను రెట్టింపుగా పెట్టినాడు.
  • he doubled his fist వాడు పిడికిటిని బిగపట్టినాడు.
  • the thief doubled the wallఆ దొంగ గోడమూల తిరిగి పరుగెత్తినాడు.
  • the hare doubled the hillఆ కుందేలు కొండను తిరిగి పరుగెత్తినది.
  • we doubled the cape కేపు అనే దేశమును చుట్టుకుని పోయినాము.
  • he doubled down the leaf అది తెలియడానకు వక కాకితపు కొనను మడిచిపెట్టినాడు.
  • he doubled up the handkerchief వాడు రుమాలను మడత పెట్టినాడు.

విశేషణం, రెట్ట, రెట్టింపు, జంట, జమిలి, జోడు.

  • double troubleరెట్టింపు, తొందర, అధిక ఆయాసము.
  • double advantage అధికఫలము.
  • a double letter in spelling ద్విత్వాక్షరము.
  • a double letter of postageరెట్టింపు తపాల్కూలి చెల్లించవలసిన జాబు, పెద్దజాబు.
  • he wrote it in double linesపెద్దక్షరాలుగా వ్రాసినాడు.
  • double fanam పెద్దరూక.
  • he was double with age వృద్దాప్యముచేత వాడికి నడుము వంగిపోయినది .
  • she has a double chin దాని గడ్డముమడతలు పడుతున్నది.
  • she has a double chin దాని గడ్డము మడతలుపడుతున్నది.
  • double tooth దవడపల్లు.
  • double edged రెండంచులు, రెట్టంచుగల.
  • double tongued రెండు నాలికలుగల, రెట్టంచుగల.
  • double tongued రెండునాలికలు గల,కపటియైన.
  • a double barrelled gun రెట్ట తుపాకి.
  • double the readed cloth జమిళిరేకు.
  • double meaning ద్వ్యర్ధము, శ్లేష.
  • double minded కపటి.
  • వంచకుడు.

క్రియా విశేషణం, రెట్టింపుగా, రెండింతలుగా, మడుపుగా.

  • he did double the quantity యితను రెండింతలుగా చేసినాడు.
  • he walks double గూని వంచుకొనినడుస్తాడు, నడుము వంచుకొని నడుస్తాడు.
  • the palankeen was so small he was obliged to sit nearly double పల్లకి చిన్నది గనుక వంగికూర్చున్నాడు.
  • double as much as it is wanted కావలసినంతకు రెండింతలు.
  • he sees double వాడికి వకటి రెండుగా అగుబడుతున్నది.

క్రియా విశేషణం, వంగినట్టుగా.

  • he grew double వానికి నడుము వంగిపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=double&oldid=929484" నుండి వెలికితీశారు