1972
Appearance
1972 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
1969 1970 1971 - 1972 - 1973 1974 1975 | సంవత్సరాలు: | |
1950లు 1960లు - 1970లు - 1980లు 1990లు | దశాబ్దాలు: | |
K s Kiran | ||
దశాబ్దాలు: |
సంఘటనలు
[మార్చు]- జనవరి 31: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
- జూన్ 5: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.
- ఆగష్టు 26: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్‌లో ప్రారంభమయ్యాయి.
- డిసెంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
జననాలు
[మార్చు]- జనవరి 7 : ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.
- ఫిబ్రవరి 4: శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత.
- ఫిబ్రవరి 13: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
- ఏప్రిల్ 14: కునాల్ గానావాలా, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు.
- ఏప్రిల్ 17: ఇంద్రగంటి మోహన కృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు.
- ఏప్రిల్ 20: మమతా కులకర్ణి, హిందీ సినీనటి.
- జూన్ 3: టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
- జూలై 18: సౌందర్య, సినీనటి. (మ.2004)
- అక్టోబర్ 11: సంజయ్ బంగర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- నవంబర్ 17: రోజా సెల్వమణి, దక్షిణ భారతదేశంలో సినిమా నటి, రాజకీయవేత్త.
- నవంబర్ 18: జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత.
- డిసెంబర్ 21: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు.
మరణాలు
[మార్చు]- జనవరి 10: పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు. (జ. 1894)
- జనవరి 22: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)
- జనవరి 23: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914)
- జనవరి 31: నేపాల్ రాజుగా పనిచేసిన మహేంద్ర.
- మే 7: దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921)
- మే 29: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)
- జూన్ 20: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1898)
- జూలై 19: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901)
- జూలై 19: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930)
- జూలై 28: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918)
- సెప్టెంబరు 15: కె.వి.రెడ్డి, ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత. (జ.1912)
- సెప్టెంబరు 27: గోగినేని భారతీదేవి, స్వతంత్ర సమర యోధురాలు, సంఘ సేవిక. (జ. 1908)
- నవంబరు 5: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925)
- నవంబరు 18: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)
- డిసెంబర్ 21: దాసరి కోటిరత్నం, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910)
- డిసెంబర్ 25: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)
- డిసెంబర్ 25: కాకాని వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.
పురస్కారాలు
[మార్చు]- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : పంకజ్ మల్లిక్.
- జ్ఞానపీఠ పురస్కారం : రామ్‌ధరీ సింగ్ 'దినకర్'.
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: మదర్ థెరీసా