ఎలక్ట్రోలైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎలక్ట్రోలైట్ అనేది నీరు లాంటి ధృవ ద్రావణిలో (polar solvent) కరిగినప్పుడు విద్యుత్ వాహకంగా పనిచేసే ద్రావణం. ఈ కరిగిన ఎలక్ట్రోలైటు యానయాన్లు, కాటయాన్లుగా విడిపోయి ద్రవమంతటా సమానంగా విస్తరిస్తాయి. విద్యుదావేశపరంగా ఈ ద్రావణం తటస్థమైనది. ఈ ద్రావణంలో ఎలక్ట్రోడులను ఉంచి విద్యుత్ పొటెన్షియల్ (electric potential) కల్పించినపుడు కాటయాన్లు కాథోడు వైపు, యానయాన్లు ఆనోడు వైపుకు ప్రయాణిస్తాయి. ఈ విధమైన వ్యతిరేక చలనాలు ద్రావణంలో విద్యుత్ ప్రవహించేటట్లు చేస్తాయి. ఇది లవణాలు, ఆమ్లాలు, క్షారాలు వంటి అన్ని ద్రావణాల్లో జరుగుతుంది.

వైద్యశాస్త్రంలో ఎవరైనా రోగి, వాంతులు, విరేచనాలకు లోనైనప్పుడు ఎలక్ట్రోలైట్ ను ఎక్కించాల్సి ఉంటుంది. విపరీతమైన శారీరక శ్రమ చేసే ఆటగాళ్ళకు కూడా ఇవి అవసరమవుతూ ఉంటాయి.

చరిత్ర

[మార్చు]

1884 లో స్వాంటే అర్హీనియస్ అనే శాస్త్రజ్ఞుడు తన పరిశోధనా పత్రంలో ఘనరూపంలోని కొన్ని లవణాలు, ద్రావణంలో కరిగినప్పుడు ద్వంద్వావేశం కలిగిన కవల ఆవేశ కణాలుగా విడిపోవడం గురించి తెలియజేశాడు. ఈ పరిశోధనకు గాను 1903 లో ఆయనకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "The Nobel Prize in Chemistry 1903". Retrieved 5 January 2017.
  2. Harris, William; Levey, Judith, eds. (1975). The New Columbia Encyclopedia (4th ed.). New York City: Columbia University. p. 155. ISBN 978-0-231035-729.
  3. McHenry, Charles, ed. (1992). The New Encyclopædia Britannica. Vol. 1 (15 ed.). Chicago: Encyclopædia Britannica, Inc. p. 587. Bibcode:1991neb..book.....G. ISBN 978-085-229553-3.
  4. Cillispie, Charles, ed. (1970). Dictionary of Scientific Biography (1 ed.). New York City: Charles Scribner's Sons. pp. 296–302. ISBN 978-0-684101-125.