Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

తు యుయు

వికీపీడియా నుండి
తు యుయు
屠呦呦
డిసెంబరు 2015 లో వైద్యరంగంలో నోబెల్ బహుమతి పొందిన తు యుయు
జననం (1930-12-30) 1930 డిసెంబరు 30 (వయసు 93)
నింగ్బో, జెజియాంగ్, చైనా
నివాసంబీజింగ్
పౌరసత్వంపీపుల్స్ రిపబ్లిక్ చైనా
జాతీయతచైనీయులు
జాతిహాన్ చైనీస్
రంగములువైద్య రసాయనశాస్త్రం
చైనీస్ హేర్బాలజీ
ఏంటీమలేరియా మెడికేషన్
క్లినికల్ రీసెర్చ్
వృత్తిసంస్థలుచైనా అకాడమీ ఆఫ్ చైనీస్ మెడికల్ సైన్సెస్
చదువుకున్న సంస్థలుPeking University Medical School / Beijing Medical College (now Peking University Health Science Center)
విద్యా సలహాదారులుLou Zhicen (at Peking University Medical School / Beijing Medical College)
ప్రసిద్ధిDiscovering artemisinin and dihydroartemisinin in Project 523
ప్రభావితం చేసినవారుLou Zhicen (pharmacognosy)
Ge Hong (Chinese herbology)
Mao Zedong (promoting integrated traditional Chinese and modern Western medicine; ordering Project 523)
ప్రభావితులుProject 523
ముఖ్యమైన పురస్కారాలుLasker-DeBakey Clinical Medical Research Award (2011)
Warren Alpert Foundation Prize (2015)
Nobel Prize in Physiology or Medicine (2015)

తు యుయు (చైనీస్: 屠呦呦; జననం 30 డిసెంబరు 1930) చైనాకు చెందిన వైద్య శాస్త్రవేత్త, విద్యావేత్త. ఆమె మలేరియాపై పలు ప్రయోగాలు చేశారు. మలేరియాకు విరుగుడుగా ఆర్టెమైసినిన్‌ అనే ఔషధాన్ని కనుగొన్నారు. తు ప్రయోగాలన్నీ చైనాలో సంప్రదాయ బద్ధంగా వస్తున్న హెర్బల్‌ మెడిసిన్‌ (మూలికా వైద్యం) ఆధారంగానే జరిగాయి. ఇక, వైద్య రంగంలో తొలిసారి నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన చైనా మహిళగా తు రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఈమె చైనా అకాడమీ ఆఫ్‌ ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడిసిన్‌లో చీఫ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమెకు 2015 లో వైద్యరంగంలో నోబెల్ పురస్కారం వచ్చింది.[1][2] ఇక, వైద్య రంగంలో తొలిసారి నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన చైనా మహిళగా తు రికార్డు సృష్టించారు. లియం కాంప్‌బెల్ (ఐర్లాండ్), సతోషి ఒమురా (జపాన్), తు యుయు (చైనా)ల పరిశోధనల పుణ్యమా అని పరాన్నజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులపై పోరాడేందుకు మానవాళికి కొత్త అస్త్రాలు లభించాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె చైనాలో జన్మించి విద్యాభ్యాసం చేసి పరిశోధనలు చేసారు.[2]

మలేరియా ప్రాజెక్టు

[మార్చు]

చైనాలో సాంస్కృతిక విప్లవం ఉధృతంగా సాగుతున్న ఆరో దశకం చివరిలో అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ మావో జెడాంగ్ మలేరియా వ్యాధిని అరికట్టేందుకు నెలకొల్పిన పరిశోధనా ప్రాజెక్టులో పాలుపంచుకోవడంవల్లనే యుయు నోబెల్ పురస్కారానికి అర్హమైన వినూత్న ఆవిష్కరణ చేయగలిగారు. ఆనాడు ఒకపక్క అమెరికా సేనలతో, మరోపక్క దక్షిణ వియత్నాం సేనలతో పోరాడుతున్న తమ సైన్యానికి మలేరియా పెను సమస్యగా మారిందని గుర్తించిన ఉత్తర వియత్నాం ప్రధాని హో చి మిన్...దాన్ని అరికట్టడానికి సాయం చేయమని మావోను అభ్యర్థించారట. ఫలితంగా ఆ ప్రాజెక్టు ఆవిర్భవించింది. ఈ ప్రాజెక్టులో రెండు విభాగాలున్నాయి. మలేరియాను అరికట్టేందుకు అప్పటికే వినియోగిస్తున్న రసాయనాలను మేళవించి కొత్త ఔషధాన్ని కనుగొనడానికి ఒక విభాగం... సంప్రదాయ వైద్య విధానాలపై దృష్టి నిలిపి, మూలికలతో ఔషధాన్ని రూపొందించే పనిలో మరో విభాగం నిమగ్నమయ్యాయి. యుయు నేతృత్వంలోని బృందం శతాబ్దాలుగా వాడుకలో ఉన్న 2,000 రకాల ఔషధ యోగాలను అధ్యయనం చేసి, 640 మూలికల లక్షణాలను జల్లెడపట్టి...క్రీస్తు పూర్వం 340 నాటి తాళపత్రాలను సైతం పరిశోధించి అత్యుత్తమమైన ఆర్టిమేసినిన్ అనే ఔషధాన్ని తయారుచేశారు. అప్పటికే క్లోరోక్విన్, క్వినైన్ వంటి మందులకు లొంగకుండా పోయిన మలేరియా కారక సూక్ష్మజీవి యుయు దెబ్బతో అదుపులోనికొచ్చింది. ఇప్పుడామె ఆవిష్కరణ ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కాపాడుతోంది. గత పదిహేనేళ్లలో మలేరియా మరణాలు 60 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.[3]

మలేరియాకు మందు ఆవిష్కరణ

[మార్చు]

చైనా సంప్రదాయ వైద్యవిధాన సంస్థలో పనిచేస్తున్న 84 ఏళ్ల తు యుయు 1972లో ఆవిష్కరించారు. రెండువేల ఏళ్ల కిందే దీన్ని వాడేవారన్న పురాతన గ్రంథాల ఆధారంగా యుయు తు తన పరిశోధనలను నిర్వహించారు. 1967లో మావో జెడాంగ్ ఏర్పాటు చేసిన మలేరియా డ్రగ్ ప్రాజెక్టులో భాగంగా తు యుయు నిర్వహించిన పరిశోధనల ఫలితంగా ఆర్టిమిసిన్ అనువా అనే మొక్క ఆకుల్లో మలేరియాకు విరుగుడు మందు ఉందన్న విషయం తెలిసిందే. రెండులీటర్ల చల్లనీటిలో ఈ మొక్క ఆకులు తగినన్ని ఉంచి ఆ తరువాత ఆకుల పసరు తాగితే మలేరియా లక్షణాలు దూరమవుతాయని క్రీస్తుపూర్వం 340లో రాసిన ఓ వైద్య గ్రంథంలో దీని ప్రస్తావన ఉందని గుర్తించిన తు.. అందుకు తగ్గట్టుగా ఆర్టిమిసినిన్‌ను మొక్క నుంచి వేరు చేసే ప్రక్రియనుకూ డా రూపొందించారు. మలేరియాపై ఈ మందు అత్యంత సమర్థంగా పనిచేస్తుందని తరువాతి పరిశోధనల ద్వారా స్పష్టం కావడంతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా వాడటం మొదలైంది.[4] 2000 నుంచి 2015 మధ్యకాలంలో మలేరియా మరణాలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో కనీ సం నాలుగోవంతు ఆర్టిమిసినిన్ ద్వారా సాధ్యమైందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంటే ఈ ఒక్క మందు పదిహేనేళ్లలో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కాపాడిందన్నమాట.

పురస్కారాలు

[మార్చు]
  • 1978, నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ప్రైజ్, పి.ఆర్.చైనా [5]
  • 1979, నేషనల్ ఇన్వెంటర్స్ ప్రైజ్, పి.ఆర్.చైనా
  • 1992, (One of the) Ten Science and Technology Achievements in China, State Science Commission, P.R. China[5]
  • 1997, (One of the) Ten Great Public Health Achievements in New China, P.R. China[5]
  • September 2011, GlaxoSmithKline Outstanding Achievement Award in Life Science[6]
  • September 2011, Lasker-DeBakey Clinical Medical Research Award[7]
  • November 2011, Outstanding Contribution Award, China Academy of Chinese Medical Sciences[8]
  • February 2012, (One of the Ten) National Outstanding Females, P.R. China[9]
  • June 2015, Warren Alpert Foundation Prize (co-recipient)[10]
  • October 2015, Nobel Prize in Physiology or Medicine 2015 (co-recipient) for her discoveries concerning a novel therapy against Malaria, awarded with one half of this prize; and William C. Campbell and Satoshi Ōmura jointly awarded with another half for their discoveries concerning a novel therapy against infections caused by roundworm parasites.[11]

మూలాలు

[మార్చు]
  1. వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్‌ 06-10-2015[permanent dead link]
  2. 2.0 2.1 Miller, Louis H.; Su, Xinzhuan (2011). "Artemisinin: Discovery from the Chinese herbal garden". Cell. 146 (6): 855–858. doi:10.1016/j.cell.2011.08.024. PMC 3414217. PMID 21907397.
  3. 'సంప్రదాయత'కు నోబెల్ పట్టం[permanent dead link]
  4. మలేరియా, ఫైలేరియాపై పోరు..
  5. 5.0 5.1 5.2 "Tu Youyou 屠呦呦". China Vitae. Archived from the original on 29 నవంబరు 2011. Retrieved 7 March 2012.
  6. "Chen Zhili Congratulates Lasker Award Winner Tu Youyou". Women of China. 22 September 2011. Archived from the original on 6 అక్టోబరు 2015. Retrieved 7 March 2012.
  7. "Tu Youyou". Lasker Foundation. 12 September 2011. Archived from the original on 8 అక్టోబరు 2015. Retrieved 12 September 2011.
  8. "Tu is awarded Outstanding Contribution Award by CACMR" (in చైనీస్). Xinhua News Agency. 15 November 2011. Retrieved 10 February 2012.
  9. 吴菊萍屠呦呦获授三八红旗手标兵 (in చైనీస్). Sina.com News. 28 February 2012. Retrieved 7 March 2012.
  10. "ఆర్కైవ్ నకలు" Alpert Prize Recognizes Malaria Breakthroughs. Warren Alpert Foundation. 4 June 2015. Archived from the original on 14 జూన్ 2015. Retrieved 14 June 2015. {{cite web}}: Invalid |script-title=: missing prefix (help)
  11. "Nobel Prize announcement" (PDF). NobelPrize.org. Nobel Assembly at Karolinska Institutet. Retrieved 5 October 2015.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తు_యుయు&oldid=3800404" నుండి వెలికితీశారు