Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

వికీపీడియా:సంయమనంగా ఉండండి

వికీపీడియా నుండి
కుకుంబర్లా కూల్ గా ఉండటానికి ప్రయత్నించండి
It's all cool.

వికీపీడియా కొన్ని తీవ్రమైన వివాదాలు చూసింది. ఆన్‌లైన్‌ లో వివాదాలు చాల త్వరగా చెలరేగుతాయి. ప్రతిస్పందనలు చాలా త్వరగా వచ్చే వికీపీడియా లాంటి చోట అయితే మరీను. కానీ గుర్తుంచ్కోవలసినది ఏమిటంటే - మనమంతా ఇక్కడకు చేరిన కారణం ఒకటే. జగడాల వల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోగా వాటి వలన అందరికీ తలనెప్పే.

జగడాలను నివారించడానికి కొన్ని చిట్కాలు ఇవిగో చూడండి:

  1. మీతో ఎవరైనా విభేదిస్తే ఎందుకో ఆలోచించండి. మీ వాదనను ఎందుకు సరైనదో చర్చా పేజీల్లో కారణాలు చూపించండి.
  2. సభ్యులకు పేర్లు పెట్టకండి. దాంతో నిర్మాణాత్మకమైన చర్చకు ఆస్కారం పోతుంది.
  3. నిదానించండి. కోపంగా ఉన్నపుడు రచనలు చెయ్యకండి. కాస్త సమయం తీసుకొని మరుసటి రోజో ఆ తరువాతో తిరిగి రండి. మీరు చెయ్యదలచిన మార్పును మరొకరు చేసి ఉండవచ్చు.
  4. కేవలం రాసిన దాన్ని చదవడం అనేది సందిగ్ధతతో కూడి, అపార్థాలకు దారితీసే ప్రమాదం చాలా ఉంది. మనుషులు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకున్నట్లు కాదు. ముఖకవళికలు, స్వరంలోని భావం ఇవేవీ ఉండవు. వీలైనంత మర్యాదగా, వివరంగా, ఎదుటి వారి వాదనను మీరు ఎలా అర్థం చేసుకున్నారో వివరిస్తూ రచనలు చెయ్యాలి.
  5. ఇతరుల గురించి అంతా మంచిగానే ఆలోచించండి.
  6. వాదనలో పొరపాటున రాయగూడని మాట రాసి ఉండవచ్చు. వెంటనే క్షమాపణ కోరండి. అది మనం చెయ్యగలిగిన కనీసమైన పని.
  7. తొలగింపులు చెయ్యకూడదని ఒక నియమం పెట్టుకోండి. తాము రాసిన దాన్ని అలా తొలగించేస్తే, అది రాసినవారికి కష్టంగా ఉంటుంది.
  8. పరిస్థితి మరీ దిగజారితే, ఆ పేజీ నుండి తప్పుకోండి. ఇంకా చాలామంది ఉన్నారు ఆ పేజీ సంగతి చూసేందుకు. ఇందువలన మీకు మనశ్శాంతీ ఉంటుంది, ఆ సమయాన్ని మరో వ్యాసం కోసం వాడవచ్చు కూడా.

నిందలతో వ్యవహారం

[మార్చు]

వ్యక్తిగతమైన నిందలు చెయ్యకూడదని వికీపీడియాలో అందరూ ఒప్పుకున్నదే అయినా, పెళుసు మాటలు విసురుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. దీన్ని అరికట్టడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి:

  1. పట్టించుకోకండి. తిట్లు కష్టం కలిగిస్తాయి. అయితే, వాటివల్ల ఉపయోగమూ లేదు, పరిణతి చెందిన వారు చేసే పనీ కాదది. మీ పని మీరు చేసుకుపోండి; వాటికి సమాధానమివ్వాల్సిన పని లేదు.
  2. తిట్లను ఉపసంహరించుకొమ్మని మిమ్మల్ని తిట్టిన వ్యక్తిని మర్యాదగా అడగండి. కొన్నిసార్లు వాళ్ళు అనుకోకుండా అలా రాసి ఉండవచ్చు, లేదా కావాలని చేసినా తమ తప్పును ఈ పాటికి తెలుసుకుని ఉండవచ్చు. మీరే పొరపాటున ఎవరినైనా తిట్టి ఉంటే, క్షమాపణ అడగండి. మీరా నింద కావాలనే చేసి, నిజాయితీగా క్షమాపణ చెప్పలేని పక్షంలో, మౌనంగా ఉండండి. అదీ లాభం లేదనుకుంటే, మీ అభ్యంతరాలేమిటో వివరంగా చెప్పండి, నిందించడం తగదు.

తటస్థ దృక్కోణం వైపు ప్రయాణం

[మార్చు]

తటస్థ దృక్కోణాన్నీ అతిక్రమించిన సందర్భాల్లో దాన్ని సవరించే వారే అనుకోకుండా ఏదో ఒక దృక్కోణానికి చూపించే పొరపాటు చేస్తారు. "ఫలానా వారు ఇలా అన్నారు.." వంటి మాటలు అలాంటివే. అప్పుడు అసలు సభ్యునికి ఇది నచ్చక, ఈ వాదనలో తటస్థత లేదని ఎత్తి చూపవచ్చు. దాంతో యుద్ధం మొదలవుతుంది. ఆ సందర్భాల్లో కింది పద్ధతులను పాటించవచ్చు:

  1. మీరు తటస్థంగా లేదని భావించిన అంశాల గురించి వ్యాసపు చర్చా పేజీలో మర్యాదగా లేవనెత్తి, మార్పులను సూచించండి.
  2. సమాధానమేమీ రాకపోతే మార్పులు చేసెయ్యండి.
  3. సమాధానమొస్తే, మీరు వాడదలచిన పదాల విషయంలో ఒక అంగీకారానికి రండి.

ఆ విధంగా ఒక అంగీకారానికి వస్తే, ఇక యుద్ధం లేనట్లే. ఈ పద్ధతిలో ఒక లోపమేమిటంటే, ఈ ఒప్పందాలు కుదిరే కాలంలో వ్యాసం అసంపూర్తిగా ఉండిపోతుంది. అయితే నిమిష నిమిషానికీ మారిపోయే వ్యాసం కంటే ఇది నయమే కదా!

పై వ్యూహం పనిచెయ్యని కేసులుంటాయి. తటస్థంగా రాయనే లేని వారు, రాయదలచని వారు, సరైన సమాచారాన్ని తొలగించే వారు, అసాంఘిక శక్తులు మొదలైన రకరకాల సభ్యులు ఉంటారు. ఇలాంటి వారు వికీపీడియాలో ఉండకూడదని మనం అనుకుంటాం, అలాంటి కొంతమందిని నిషేధించాం కూడా. వికీపీడియన్లందరూ తమకిష్టమైన విషయాల్లో కొద్దో గొప్పో తటస్థత నుండి పక్కకు పోతూ ఉంటారు; అయితే వీటిని సవరించడం సులభం.

ఇంకా చూడండి

[మార్చు]