Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

సర్వనామము

వికీపీడియా నుండి

నామవాచకం (Noun) కు బదులుగా వాడబడేది సర్వనామము (Pronoun). సర్వము అంటే అన్నీ, అంతా అని అర్ధము.

ఉదాహరణలు
అతడు - ఇతడు - అది - ఇది - ఆమె - ఈమె - అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - కొంత - ఆ - ఈ - ఏ - నీవు - నేను - మీరు - మేము - మనము - వారు - ఎవరు - ఏది - తమరు - తాము - తాను - వాడు - వీడు.you------

రకాలు

[మార్చు]
1. సంబంధ సర్వనామము
సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసే సర్వనామం "సంబంధ సర్వనామం".

ఉదాహరణ : ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి. ఇందులో ఎవడు-వాడు అనే రెండు సర్వనామాలు పనిచేయడానికి దోషి అవడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. కనుక ఇవి, ఇలాంటివి సంబంధ సర్వనామాలు.

2. విశేషణ సర్వనామము
సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు "విశేషణ సర్వనామాలు".

ఉదాహరణ : అందరు అందరు కారు. ఇందులో అందరు అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం.

3. సంఖ్యావాచక సర్వనామము
సంఖ్యలను తెలియజేసే సర్వనామాలు "సంఖ్యావాచక సర్వనామాలు".

ఉదాహరణ : ఒకరు - ఇద్దరు - ముగ్గురు - నలుగురు మొదలైనవి సంఖ్యావాచక సర్వనామాలు.

4. సంఖ్యేయవాచక సర్వనామము
ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి. కాని, నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు. కనుక "సంఖ్యేయవాచక సర్వనామం".

ఉదాహరణ : వారు ముగ్గురూ వీరే. ఇందులో ఆ ముగ్గురూ పురుషులా, స్త్రీలా అనేది చెప్పబడనందున ఇది సంఖ్యేయవాచక సర్వనామం.

5. పురుషలకు సంబంధించిన సర్వనామం
ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలు మూడు. వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇవి "పురుషలకు సంబంధించిన సర్వనామాలు".

ఉదాహరణ : ప్రథమ పురుష : వాడు - వారు; మధ్యమ పురుష : నీవు - మీరు; ఉత్తమ పురుష : నేను - మేము - మనము

6. నిర్దేశాత్మక సర్వనామము
నిర్దేశించటం అంటే ఇది అని నిర్దేశించి చెప్పటం - అలాంటి సర్వనామాలు "నిర్దేశాత్మక సర్వనామాలు".

ఉదాహరణ : ఇది - ఇవి - అది - అవి

7. అనిర్ధిష్టార్థక సర్వనామాలు
నిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పటం. అనిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పకపోవటం. ఇంత లేదా ఇన్ని లేదా ఇవి అని చెప్పకుండా ఎంతో కొంతను తెలియజేసే సర్వనామ పదాలు ఈ "నిర్ధిష్టార్థక సర్వనామాలు".

ఉదాహరణ : అన్ని - ఇన్ని - కొన్ని - ఎన్ని - కొంత - పలు - పెక్కు - బహు

8. ప్రశ్నార్థక సర్వనామము
ప్రశ్నించేటట్టుగా అడుగబడే సర్వనామాలు "ప్రశ్నార్థక సర్వనామాలు". ప్రశ్నించడం అంటే అడగడం అని అర్ధం.

ఉదాహరణ : ఎవరు? - ఎందుకు? - ఏమిటి? - ఎవతె? - ఎలా?